ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

.

author img

By

Published : May 18, 2021, 7:00 PM IST

7PM top news
7PM top news
  • రాష్ట్రంలో కొత్తగా 21,320 కరోనా కేసులు, 99 మరణాలు నమోదు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేలపైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,253 నమూనాలను పరీక్షించగా 21,320 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: అచ్చెన్న

ఎల్లుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను తెదేపా బహిష్కరిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. కరోనా కష్ట సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా.. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రైతులు, కూలీలు, పశువుల కాపరులు బహిరంగ ప్రాంతాల్లో ఉండవద్దని సూచించింది. సురక్షిత భవనాల్లోనే ఆశ్రయం పొందాలని విపత్తుశాఖ కమిషనర్‌ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా రికవరీల్లో భారత్​ సరికొత్త రికార్డ్

భారత్​లో ఒక్క రోజులో 4,22,436 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు మే 3న 81.7శాతం ఉండగా ప్రస్తుతం 85.6శాతానికి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారం!

కరోనా మరణాలు, బాధితులకు సంబంధించి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50,000 పరిహారం సహా.. పేదలకు ఉచిత రేషన్​ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • '100% వ్యాక్సినేషన్ జరిగిన గ్రామానికి రూ.10లక్షలు'

టీకా ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కృషి చేస్తున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. 100 శాతం వ్యాక్సినేషన్ సాధించిన గ్రామాలకు రూ.10లక్షల అభివృద్ధి నిధులను అందించనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇజ్రాయెల్​కు పెద్ద ఎత్తున 'అమెరికా' ఆయుధాల విక్రయం

ఇజ్రాయెల్​కు అధునాతన ఆయుధాలను సరఫరా చేసే కీలక ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఆమోదం తెలిపారు. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల సామర్థం ఉన్న ఈ ఆయుధాల విలువ 735 మిలియన్​ డాలర్లు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. బైడెన్​ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ యాప్​ ఉంటే 300 మందితో రోజంతా ఫ్రీ వీడియో కాల్‌!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన వీడియో కాలింగ్ యాప్ 'టీమ్స్'లో.. 300 మంది వ్యక్తిగత వినియోగదారులు ఒకేసారి బృందంగా కలుసుకునే ఫీచర్​ను ఆవిష్కరించింది. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన కుటుంబాలు, స్నేహితులు వర్చువల్​గా మీట్​ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బాల్​ ట్యాంపరింగ్: దిద్దుబాటు చర్యల్లో ప్లేయర్లు!

బాల్​ ట్యాంపరింగ్ అంశంపై ఆసీస్ క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారు. వివాదానికి తెరలేపిన బాన్​క్రాఫ్ట్​.. ఇప్పుడు దాని గురించి కొత్తగా చెప్పడానికేమీ లేదని అంటున్నాడు. కాగా, నాటి జట్టులోని ఆసీస్ బౌలర్లు.. తమకేమీ తెలియదని.. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయండని కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ వార్తల్లో నిజం లేదు: 'ఉప్పెన' బ్యూటీ

బాలీవుడ్​ మూవీ 'వివాహ్' తెలుగు రీమేక్​లో 'ఉప్పెన' బ్యూటీ​ కృతిశెట్టి నటిస్తుందన్న వార్తలపై సదరు హీరోయిన్​ స్పందించింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న మూడు సినిమాలు మినహా మరే చిత్రాలకు సంతకం చేయలేదని తేల్చిచెప్పింది. ఒకవేళ అంగీకరిస్తే తప్పకుండా తెలియజేస్తానంటూ సోషల్​మీడియాలో కృతి పోస్ట్​ పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.