ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

.

ప్రధాన వార్తలు
ప్రధాన వార్తలు @ 3PM
author img

By

Published : Oct 20, 2020, 3:00 PM IST

Updated : Oct 20, 2020, 3:07 PM IST

  • జగన్ ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కి వాయిదా పడింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • హైదరాబాద్​లో వరద బాధితులకు అండగా ఉండండి: చంద్రబాబు

భాగ్యనగరంలో వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తెదేపా కార్యకర్తలు అండగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రజల భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్విటర్​ వేదికగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు...అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాలు కనువిందుగా సాగుతున్నాయి. నాలుగోరోజైన ఇవాళ అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల పాటు వాయువ్యంగా అల్పపీడనం కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు కిక్ల్ చేయండి

  • దేశంలో తగ్గిన యాక్టివ్ కేసులు- భారీగా పెరిగిన రికవరీలు

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో ప్రస్తుతం 10 శాతం కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. రికవరీలు 88.63 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.52 శాతంగా ఉన్నట్లు వివరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మరో ఉద్దీపనపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?

కరోనా నేపథ్యంలో మరో ఉద్దీపన ప్యాకేజీ ఉండొచ్చనే అంచనాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఊతమందించారు. ఉద్దీపన ప్యాకేజీ అంశాన్ని పూర్తిగా వదిలేయలేదని.. 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్​.కె.సింగ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 6గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ ప్రజలకు మోదీ ఓ సందేశాన్ని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.కరోనా సంక్షోభం, బిహార్​ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని ఏ విషయంపై జాతినుద్దేశించి ప్రసంగిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బాలయ్య 'నర్తనశాల' ఫస్ట్​లుక్ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం 'నర్తనశాల'. ఈ సినిమా షూటింగ్​ను అప్పట్లో ప్రారంభించినా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితే అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు బాలయ్య. దసరా కానుకగా 17 నిమిషాల వీడియోను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా నేడు ఆ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సీఎస్కే ఎందుకిలా విఫలవుతోంది!

ఈ ఐపీఎల్​ సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్ అనుకున్నంతగా రాణించలేకపోతుంది. వరుస మ్యాచ్​ల్లో విఫలమవుతూ అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోంది. సీఎస్కే ఈసారి లీగ్​లో విఫలమవడానికి చాలా కారాణాలున్నాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చైనా టీకా‌ సురక్షితం- బ్రెజిల్​ ఇనిస్టిట్యూట్​ వెల్లడి!

చైనాకు చెందిన సినోవాక్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్‌ టీకా మూడో దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు తేలింది. ఈ మేరకు బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ బయోమెడికల్ పరిశోధనా కేంద్రమైన సావో పాలో బుటాంటన్‌ ఇనిస్టిట్యూట్ ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Last Updated : Oct 20, 2020, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.