- మాకు అప్పు కావాలి.. మరింత అప్పు కావాలి.. రాష్ట్ర సర్కారు లేఖలు!
రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల అప్పు కావాలని రిజర్వు బ్యాంకుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ ప్రస్తుతం ఏపీకి రూ.10,500 కోట్లకే పరిమితి మాత్రమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. కానీ తమకు అదనపు రుణాలకు అర్హతలు ఉన్నాయంటూ ఆర్థికశాఖ అధికారులు కేంద్రానికి లేఖలు రాస్తున్నట్లు సమాచారం. దీనిపై రిజర్వుబ్యాంకు సూచనాత్మక క్యాలెండర్ విడుదల చేసింది.
- మరింత వైభవంగా.. సాలకట్ల బ్రహ్మోత్సవాలు:తితిదే ఈవో
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తామని.. తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో కలిసి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లగా కరోనా ప్రభావంతో ఘనంగా నిర్వహించలేకపోయామని అన్నారు.
- సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసు... వెంకటేష్‌కు బెయిల్
సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంలో సీఐడీ అరెస్టు చేసిన తెదేపా కార్యకర్త గార్లపాటి వెంకటేష్‌కు బెయిల్ మంజూరైంది. వెంకటేష్ ను రిమాండ్ కు పంపాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి న్యాయమూర్తి... ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సొంతపూచీపై వెంకటేషకు బెయిలిచ్చారు. సిఐడీ అధికారులు కుట్రపూరితంగా వెంకటేష్ పై కేసు పెట్టారని... దీనిపై ప్రైవేటు కేసు వేయనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.
- నేటినుంచే.. హైదరాబాద్‌లో భాజపా జాతీయ సమావేశాలు
Bjp national executive meeting: హైదరాబాద్ వేదికగా భాజపా జాతీయ పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ సహా భాజపా పాలిత ముఖ్యమంత్రులు, అగ్రనేతలు రానుండటంతో రాష్ట్ర నాయకత్వం దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఎన్నికలు, పార్టీ విస్తరణ, మోదీ పాలన గురించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు.
- కన్హయ్య హత్యకేసు నిందితులకు 26/11 ఉగ్రదాడితో సంబంధం?
రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య అనంతరం వారు పారిపోయిన ద్విచక్రవాహనం నంబర్ ప్లేట్ 2611గా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 26/11 ముంబయి ఉగ్రదాడులకు వారికి సంబంధాలు ఉన్నాయా ? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
- 'రూ.350 లంచం కేసు'.. 24ఏళ్ల క్రితం విధించిన శిక్షను కొట్టివేసిన హైకోర్టు
24 ఏళ్ల క్రితం ఓ పోలీసు అధికారికి దిగువ కోర్టు విధించిన ఏడాది జైలు శిక్షను బాంబే హైకోర్టు కొట్టివేసింది. రూ.350 లంచం తీసుకున్నట్లు 1988లో ఓ పోలీసు అధికారిపై కేసు నమోదైంది. ఫిర్యాదుదారు నుంచి అతడు తీసుకున్న సొమ్ము లంచమే అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ధర్మాసనం పేర్కొంది.
- అక్టోబర్ 1 నుంచి కొత్త రకం టైర్లు.. ఆ వాహనాలకు తప్పనిసరి!
ప్రయాణికుల కార్లు, ట్రక్కులు, బస్సులకు నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన కొత్త రకం డిజైన్ల టైర్లు వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తెస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.
- 48 ఏళ్ల క్రితం నాటి బిల్‌గేట్స్ రెజ్యూమ్ వైరల్
bill gates resume: వ్యాపారవేత్త, అపర కుబేరుడు బిల్‌గేట్స్ 48 ఏళ్ల క్రితం తాను తయారు చేసుకున్న రెజ్యూమ్‌ను లింక్డ్ఇన్లో షేర్ చేశారు. బిల్‌గేట్స్ ఈ రెజ్యూమ్‌ను పంచుకుంటూ దీనికి మరిన్ని మెరుగులు దిద్దితే బాగుండేదని కూడా అభిప్రాయపడ్డారు. అయితే నెటిజన్లు మాత్రం గేట్స్ రెజ్యూమ్ పర్ఫెక్ట్ ఉందని అంటున్నారు.
- ఆపరేషన్ స్టార్ట్ అంటున్న రామ్ 'ది వారియర్'.. ఊర మాస్‌లుక్‌లో 'దసరా' నాని..
హీరో రామ్ పోతినేని నటిస్తున్న 'ది వారియర్' మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. మరోవైపు, నాని హీరోగా తెరకెక్కుతున్న 'దసరా' సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను నాని షేర్ చేశారు. బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులను ఎంతో ఆకట్టుకుంటూ మూవీపై అంచనాలు పెంచుతోంది.