- YCP Plenary: వైకాపా జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక
YSRCP lifetime president ys jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైకాపా) జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసి ఆమోదించారు. పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు-ఎంఎస్ఎంఈ, వ్యవసాయంపై తదితర అంశాలపై తీర్మానాలు చేసిన వైకాపా నేతలు.. వాటిపై చర్చించారు. తీర్మానాలను ఆమోదించిన అనంతరం సీఎం జగన్.. ప్లీనరీ ముగింపు ప్రసంగం చేశారు.
- "రాష్ట్రంలో భారీ వర్షాలు.. అత్యవసరమైతే ఈ నంబర్లకు ఫోన్ చేయండి"
Rains: దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నైరుతీ రుతుపవనాలు అత్యంత క్రియాశీలకంగా మారినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా - కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
- జగన్ రెడ్డి.. రైతులను మోసం చేస్తున్నారు : తెదేపా
Rythu Poru Mahasabha at Paritala: జగన్ రెడ్డి.. మూడేళ్లుగా రైతు వంచన పాలన సాగిస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి రక్తంలోనే మోసం, నయవంచన ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ "రైతుపోరు మహాసభ"లో నేతలు మాట్లాడారు.
- కోడికత్తి కేసు.. సీజేఐకి లేఖ రాసిన నిందితుడి తల్లి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు.
- రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో దూసుకెళ్లిన భారత్.. 54శాతం జంప్
defence exports India: రక్షణ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ దూసుకెళ్లింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.13 వేల కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. గతేడాది కంటే ఇది 54 శాతం అధికమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
- మహేశ్-త్రివిక్రమ్ మూవీ.. అప్డేట్ వచ్చేసింది..
Mahesh Trivikram movie: మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం చెప్పింది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించింది.
- టీ20ల్లో రోహిత్ మరో రికార్డ్.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 300 ఫోర్లు కొట్టిన బ్యాటర్ జాబితాలో చేరాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఈ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా, టీమ్ ఇండియా నుంచి తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
- క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా.. వీటిని ఓసారి చెక్ చేసుకుంటే సరి.. వెంటనే లోన్!
Credit Score: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. అయితే క్రెడిట్ కార్డు యూజర్ ఆర్థిక విషయాల్లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాడో క్రెడిట్ స్కోర్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు క్రెడిట్ స్కోర్ తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో ఓ సారి వీటిని చెక్ చేసి సరిచేసుకుంటే మళ్లీ స్కోరు గాడిన పడుతుంది.
- లంకేయుల కన్నెర్ర.. తారస్థాయికి ఆందోళనలు.. ప్రధాని రాజీనామా
Srilanka Crisis: గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం బారిన చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు అదుపుతప్పాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాకు డిమాండ్ చేస్తూ శ్రీలంక అంతటా గత మార్చి నుంచి ఆందోళనలు కొనసాగుతుండగా, శనివారం అవి మరింత తీవ్ర రూపం దాల్చి రాజధాని కొలంబో రణరంగంగా మారింది.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - head lines
.
9 pm