- బిరా బిరా కృష్ణమ్మ
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై ఆధారపడిన రైతులకు ఇక శుభవార్త. ఆలమట్టికి వరద నీటి ప్రవాహం పెరిగింది. ఇలాగే కొనసాగితే అయిదారు రోజుల్లో ఆలమట్టి నుంచి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాటా తేల్చండి
గోదావరి- పెన్నా అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించే పథకం విషయంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ తప్పు దారి పట్టించిందని తెలంగాణ ఆరోపించింది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లింపులో మా వాటా తేల్చండి అంటూ తెలంగాణ బోర్డుకు లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సాగుకు గ్యాస్ గాయం
రాష్ట్రమంతటా మంచి వర్షాలు పడుతూ వాతావరణం సాగుకు అనుకూలంగా మారింది. కానీ ఆ ప్రాంతంలో మాత్రం అన్నీ ఉన్నా లేనట్టే..! సాగుకు నీరుంది. నేలా ఉంది. ఐతే అక్కడ ఇవేవీ అక్కరకు రావట్లేదు..! ఇప్పటికే ఏపుగా పెరిగిన మొక్కల పరిస్థితీ అంతే..! వందలాది మంది జీవితాలను తలకిందులు చేసిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌లీక్ ప్రభావమిది..! ఎదిగిన పంట పనికిరాక.. నాటిన మొక్కమొలకెత్తక ... నేల స్వభావం అర్థంకాక రైతులు పడుతున్న కష్టాలివి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎం'సెట్' అయ్యేనా..?
రోజురోజుకూ కరోనా కోరలు చాస్తున్న వేళ.. ఎంసెట్ పరీక్ష నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల ఉద్ధృతితో... ఈనెల 27 నుంచి జరగాల్సిన పరీక్ష జరపడం ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న తెలంగాణ విద్యార్థులకు పరీక్ష హైదరాబాద్‌లో నిర్వహించాల్సి ఉండగా... అక్కడా వైరస్ విలయతాండవం చేస్తోంది. పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అక్కడ లాక్డౌన్
మహారాష్ట్రలో కొవిడ్-19 కోరలు చాస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ అస్త్రంగా ఎంచుకొన్న ఠాక్రే సర్కార్.. పుణెలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సరిహద్దులపై సమీక్ష
తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, ఎత్తైన ప్రాంతాల్లో సాయుధ దళాలకు అవసరమైన దుస్తుల కొనుగోలుపై సమీక్షించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మృత్యు చరియలు
అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందటంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పీపుల్స్ యాక్షన్ ఘనంగా
సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని లీ షియాన్ లూంగ్ నేతృత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 93 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 83 స్థానాల్లో పీఏపీ విజయదుందుభి మోగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నన్ను తప్పించారు..!
టీమ్ ఇండియా సారథిగా తాను తప్పుకోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2007 ప్రపంచ కప్ గెలవాలని కలలు కన్న తనను.. అన్యాయంగా కెప్టెన్సీ నుంచి తొలగించారని వివరించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బిగ్‌బీ కుటుంబం నుంచి..!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో అందరూ సినిమా పరిశ్రమకు సంబంధం ఉన్నవాళ్లే. తాజాగా, ఆయన మనవడు అగస్త్య నందా హీరోగా పరిచయమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.