ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

టాప్ టెన్ న్యూస్

9 am top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Apr 1, 2021, 9:00 AM IST

  • బంగాల్​-అసోంలో రెండో దశ పోలింగ్

పశ్చిమ బంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ మెుదలైంది. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా

కరోనా టీకా పంపిణీలో భాగంగా నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్​ అందించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్రం. అలాగే టీకా డోసుల వృథాపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భట్టిప్రోలు మండలంలో వారంరోజులపాటు లాక్‌డౌన్​

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో వారంరోజులపాటు లాక్‌డౌన్​ ప్రకటించారు. కరోనాకేసులు అధికమవ్వడంతో తహసీల్దార్‌ శ్రావణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ భూములు.. నోషనల్‌ ఖాతాల చెర వీడేదెప్పుడో?

ఆ భూమి వారి సొంతం. ఏటా సాగు చేస్తున్నా భూ యాజమాన్య హక్కులు మాత్రం లభించడం లేదు. దీంతో పీఎం కిసాన్‌, రైతు భరోసాతోపాటు బ్యాంకు రుణాలూ పొందలేకపోతున్నారు. ప్రైవేటు వారిని ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. చివరికి అమ్ముకోవాలన్నా కుదరడం లేదు.ఈ సమస్యను పరిష్కరించాలని ఈ రైతులు అధికారుల చుట్టూ ఏళ్లతరబడి తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భాజపా వ్యతిరేక పోరులో దీదీకి ముఫ్తీ మద్దతు!

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచారు జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ప్రజాస్వామ్యం, దాని విలువలను రక్షించుకునేందుకు అత్యవసరంగా ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు దీదీకి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేటి నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ​

జూన్​ 28 నుంచి మొదలవనున్న అమర్​నాథ్​ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్​లు ప్రారంభంకానున్నాయి. అమర్​నాథ్​ బోర్డు అధికారిక వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్​బీ, జమ్ముకశ్మీర్​, ఎస్​ బ్యాంకుల శాఖల్లో రిజిస్ట్రేషన్​కు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలి కోసం క్లిక్ చేయండి.

  • పీపీఎఫ్‌పై వడ్డీ రేటు తగ్గింపు

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 1.1శాతం వరకు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి త్రైమాసికాల వారీగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. మరోవైపు పీపీఎఫ్​పైనా వడ్డీ రేట్లలో కోత విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మార్స్​ మిషన్​' సమాచారాన్ని ఇస్రోతో పంచుకున్న నాసా

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా).. 'మార్స్​ మిషన్​' సమాచారాన్ని ఇస్రోతో పాటు మరికొన్ని దేశాలతో పంచుకుంది. ఎవరి కార్యక్రమాలకు ప్రమాదాలు ఎదురవ్వకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నగ్న ఫొటో అడిగిన నెటిజన్​.. ప్రియమణి రిప్లై

నగ్న ఫొటోలను పోస్ట్​ చేయమని ఓ నెటిజన్​ అడగగా.. ఘాటుగా బదులిచ్చింది నటి ప్రియమణి. "మొదట మీ సోదరి లేదా తల్లిని పోస్టు చేయమని అడుగు.. ఆ తర్వాత నేను పోస్టు చేస్తా" అంటూ ఆమె సమాధానమిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్ వద్దంటే ప్రమాదమే: ఈసీబీ డైరెక్టర్

ఐపీఎల్​లో పాల్గొనే ఇంగ్లాండ్ ఆటగాళ్లతో విభేదాలు కోరుకోవట్లేదని తెలిపాడు ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్. ఐపీఎల్​పై తేల్చుకోమని చెబితే కొందరు అత్యుత్తమ ఆటగాళ్లను కోల్పోవాల్సి వస్తుందని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.