ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ఏపీ తాజా వార్తలు

టాప్ టెన్ న్యూస్

9 am top news
టాప్ న్యూస్
author img

By

Published : Feb 18, 2021, 9:00 AM IST

  • పంచాయతీ పోరు: ముగిసిన మూడో విడత పోలింగ్

పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఓటింగ్... మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. మూడోదశ పంచాయతీ ఎన్నికల్లో 80.71% పోలింగు నమోదైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియను తొందరగా ముగించారు.‌ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లెక్కింపైనా ఫలితాలు ప్రకటించట్లేదు : ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

మూడోవిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ... రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు కొందరు అధికారులు లొంగిపోయారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఫలితాలు తారుమారు చేశారు... చర్యలు తీసుకోండి'

పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని... తెదేపా నేతలు ఎన్నికల కమిషనర్​కి ఫిర్యాదు చేశారు. రీకౌంటింగ్ పేరిట ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు గడిచిన నేపథ్యంలో 'స్వర్ణిమ్ విజయ్ దివస్' పేరిట నిర్వహిస్తున్న విజయోత్సవాలలో పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యటకుల సందడి

సందర్శకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామోజీ ఫిల్మ్​ సిటీ మళ్లీ తెరుచుకోనుంది. కరోనా లాక్​డౌన్​ అనంతరం.. తొలిసారి ఫిబ్రవరి 18 నుంచి పర్యటకులను అనుమతిస్తున్నారు. సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కొవిడ్​-19 మార్గదర్శకాలను పాటించేలా నిర్వహకులు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేడు 'మహాబాహు-బ్రహ్మపుత్ర'ను​ ప్రారంభించనున్న మోదీ

ఈశాన్య భారత్​లోని ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన 'మహాబాహు-బ్రహ్మపుత్ర' ప్రాజెక్టును ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫెరన్స్​ ద్వారా హాజరవనున్నారు. వాటితో పాటు ధుబ్రి-పుల్బారి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్వాతంత్య్రం తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష!

12ఏళ్ల క్రితం.. ప్రియుడితో కలిసి తమ కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చిన యూపీ మహిళను ఉరితీసేందుకు సర్వం సిద్ధమైంది. ఇదే జరిగితే.. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి ఉరిశిక్షకు గురయ్యే మహిళగా ఆమె నిలవనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవిడ్​ సంక్షోభంపై చర్చకు 'సార్క్'​ కార్యశాల

కొవిడ్​ మహమ్మారి సంక్షోభంపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సార్క్​ దేశాల వర్క్​షాప్​ నిర్వహించనుంది భారత్​. ఆరోగ్యశాఖ కార్యదర్శుల స్థాయిలో జరగనున్న ఈ కార్యశాలకు పాక్​ను ఆహ్వానించింది. కొవిడ్​ సంక్షోభం, వైరస్​ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలపై సభ్య దేశాలు చర్చించనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వాలిమై' సినిమా గురించి మొయిన్​ అలీ అడిగాడు'

తమిళనాడు ప్రజలకు సినిమాలంటే అమితమైన ఇష్టం ఉందనే విషయం తనకు తెలియదని అంటున్నాడు టీమ్ఇండియా స్పిన్నర్​ అశ్విన్​. చెన్నైలో మ్యాచ్​ ఆడుతున్న సమయంలో హీరో అజిత్​ నటిస్తున్న 'వాలిమై' సినిమా అప్​డేట్​ గురించి తనతో పాటు ప్రత్యర్థి ఆటగాడు మొయిన్​ అలీని స్టాండ్స్​లో ఉన్న ప్రేక్షకులు అడిగారని చెప్పాడు. మరోవైపు తాను సెంచరీ సాధించినప్పుడు సిరాజ్​ సంబరాలు చేసుకోవడం గురించి అశ్విన్ తన యూట్యూబ్​ ఛానల్​ వీడియోలో​ వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విజయ్​తో సినిమా.. నాలుగురెట్లు ఆత్రుతతో అనన్య

'లైగర్' సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆత్రుతతో ఉన్నట్లు అనన్య పాండే తెలిపింది. పలు భాషల ప్రేక్షకుల్ని పలకరించనుండటం గౌరవంగా ఉందని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.