- నేడు భాజపా, జనసేన రామతీర్థ ధర్మయాత్ర.. నేతల గృహ నిర్బంధాలు
కోదండ రాముని విగ్రహం ధ్వంసం ఘటనను ఖండిస్తూ 'భాజపా- జనసేన' నేడు రామతీర్థ ధర్మయాత్రకు పిలుపునిచ్చాయి. అయితే ఈ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. భాజపా నేతలను అక్కడికి వెళ్లనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. నేతలను ముందుస్తు గృహ నిర్బంధాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'శాస్త్ర పరిశోధనలో ఎవరికీ తీసిపోం.. అన్ని రకాలుగా సత్తా చాటాం'
కొవిడ్-19 వ్యాధి నిరోధానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తయారు చేసిన ‘కొవాగ్జిన్’ టీకా పూర్తిగా సురక్షితమని, ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. ఇప్పటికే 16 వైరస్ టీకాలను ఆవిష్కరించి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం..
మారుతున్న కాలానికి అనుగుణంగా నేరగాళ్ల స్వభావం మారిపోతోంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీసులు ఎంత కృషి చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో జాప్యమవుతోంది. ఈ అంశాలే ఎజెండాగా తిరుపతి వేదికగా జరుగుతోన్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్.. పరిష్కార మార్గాలు చూపేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రధానోపాధ్యాయురాలుగా తొమ్మిదో తరగతి విద్యార్థి
సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా అమరావతి మండలం గౌడనకుంటలోని పాఠశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని ఒక్కరోజు ప్రధానోపాధ్యాయురాలిగా నియమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత శాస్త్రవేత్త, అమెరికా సంస్థపై సీబీఐ కేసు
రాడార్ల ఉపకరణాల దిగుమతిలో అక్రమాలకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది. అమెరికా సంస్థ అకాన్ సహా భారతీయ శాస్త్రవేత్త ప్రియా సురేష్‌లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యూపీ చట్టానికి 224 మంది ప్రముఖుల మద్దతు
యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బలవంతపు మత మార్పిళ్ల నిషేధ చట్టానికి 224 మంది ప్రముఖులు మద్దతు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఈ చట్టానికి వ్యతిరేకంగా 104 మంది విశ్రాంత అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన చేయడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వ్యాక్సిన్ రవాణాకు ఎయిర్‌ఫ్రైట్ కారిడార్
వ్యాక్సిన్ రవాణాకు ఎయిర్‌ఫ్రైట్ కారిడార్‌హైదరాబాద్‌లో వ్యాక్సిన్ డోసులు అధికంగా ఉత్పత్తి చేయనుండటంతో, విమానాల్లో రవాణాకు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లు చేస్తోంది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్, జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌కార్గో, దుబాయి విమానాశ్రయాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. భారత్‌లో వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతి పరంగా, దేశీయంగా పంపిణీ విషయంలో అతిపెద్ద ఎయిర్‌కార్గో కేంద్రంగా హైదరాబాద్ అవతరించినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ట్రంప్ హయంలో భారత్‌తో వాణిజ్య విభేదాలు'
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనలో భారత్‌తో వాణిజ్య విభేదాలు ఎక్కువగా వెలుగు చూశాయని ఓ సర్వే స్పష్టం చేసింది. ఇందుకు దిగుమతులపై ఎక్కువ మొత్తంలో పన్ను విధిస్తుండడమే కారణం అని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చెస్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ కపూర్
ఏఐసీఎఫ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సంజయ్ కపూర్. పదిహేనేళ్లలో చెస్ సమాఖ్యకు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డబ్బింగ్ చెబుతున్న.. 'టక్ జగదీష్'
నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం 'టక్ జగదీష్' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీంతో డబ్బింగ్ పనులు ప్రారంభించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.