ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

.

top news
9 AM ప్రధాన వార్తలు
author img

By

Published : Aug 5, 2020, 9:01 AM IST

  • చారిత్రక ఘట్టం- ఆలయ నిర్మాణానికి నేడే భూమి పూజ

రామ మందిర నిర్మాణం భూమిపూజ కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో ఈ మహా క్రతువు నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హిందువుల కల నెరవేర్చే ఈ బృహత్తర యజ్ఞానికి అతికొద్ది మంది మాత్రమే అతిథులుగా హాజరవుతున్నా.. దేశవ్యాప్తంగా కోట్లమంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రామమందిర భూమిపూజ కార్యక్రమం షెడ్యూల్​ ఇదే

కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణానికి కొద్ది గంటల్లో శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 12:30గంటలకు ఈ భూమిపూజ కార్యక్రమం ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అత్యున్నత పరీక్షలో ఉన్నతంగా.. నిలిచి గెలిచిన తెలుగు తేజాలు..!

దేశంలో అత్యున్నతంగా భావించే సివిల్‌ సర్వీస్‌ 2019 ఫలితాల్లో... రాష్ట్ర అభ్యర్థులు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా 829 మంది ఎంపికవగా... మొదటి స్థానంలో హరియాణావాసి ప్రదీప్‌సింగ్‌ నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 మంది ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన ధాత్రిరెడ్డి 46వ ర్యాంకుతో టాపర్‌గా నిలవగా... గుంటూరుకు చెందిన మల్లవరపు సూర్యతేజ 76వ ర్యాంకుతో రాష్ట్రంలో టాపర్‌గా నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రుయా ఆస్పత్రి నుంచి కరోనా రోగి మాయం

తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగి మాయమయ్యాడు. కుటుంబ సభ్యులకు రోగి చనిపోయాడని అధికారులు సమాచారం ఇచ్చారు. కడచూపునకు వచ్చిన వారికి ఎంత సేపటికీ మృతదేహాన్ని చూపించకపోవడం వల్ల ఆందోళనకు గురైన వారు నేరుగా మార్చురీలోకి వెళ్లి పరిశీలించారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాతో తగ్గిన ఆదాయం.. రాష్ట్ర ప్రభుత్వంపై రుణభారం..!

లాక్​డౌన్ నుంచి ఉపశమనం కలిగిస్తూ కేంద్రం దశలవారీగా అన్​లాక్ ప్రకటనలు చేసినా ఆదాయ పరిస్థితులు మెరుగుపడటం లేదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్​లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కరోనా వల్ల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో ఆదాయపరంగా తీవ్రనష్టం వాటిల్లుతోంది. గడిచిన నాలుగు నెలల్లో రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. నెలనెలకూ రుణభారం కూడా పెరిగిపోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అధికారం ఎక్కడ ఉంటే గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా దొడ్డిదారిన వైకాపాలోకి చేరేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారం లేకపోతే గంటా ఉండలేరన్న మంత్రి.. కేసుల నుంచి తప్పించుకునేందుకే అధికార పార్టీలోకి చేరుతున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'అధిక పన్నుల వల్లే కార్లు కొనలేకపోతున్నారు'

దేశంలో అధిక సుంకాలు, పన్నుల వల్లే అత్యధిక మంది ప్రజలు కార్లు కొనుగోలు చేయలేకపోతున్నారని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాల్లో భారత్​లోనే కార్లపై అధిక పన్నులు ఉన్నాయని తెలిపారు. 2025 నాటికి జీడీపీలో తయారీరంగ వాటా 25 శాతానికి చేరాలంటే, కార్ల అమ్మకాలు వేగంగా జరగాల్సి ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన అమెరికా

నిరాయుధ మినట్మన్ 3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని అమెరికా పరీక్షించింది. కాలిఫోర్నియా నుంచి ప్రయోగం చేపట్టినట్లు ఆ దేశ వాయుసేన తెలిపింది. అయితే ప్రపంచంలోని ప్రస్తుత పరిణామాలకు ఈ పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇంగ్లాండ్​ vs పాకిస్థాన్​: బయోసెక్యూర్​ బుడగలో టెస్టు సిరీస్​

కరోనా కారణంగా ఆగిపోయిన క్రికెట్​ను మళ్లీ తిరిగి ప్రారంభించడంలో ఇంగ్లాండ్​ ప్రధానపాత్ర పోషించింది. బయో సెక్యూర్​ వాతావరణంలో జులై 8 నుంచి వెస్టిండీస్​తో మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను నిర్వహించి అందులో విజయం సాధించింది. పాకిస్థాన్​తో మూడు మ్యాచ్​ల సిరీస్​కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి తొలి టెస్టు జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వాళ్లను స్టార్స్​ను చేసింది బంధుప్రీతి కాదు'

నెపోటిజం గురించి మాట్లాడిన ప్రముఖ నటి కరీనా కపూర్​.. బంధుప్రీతి లాంటి అంశాలను పక్కనపెట్టి కష్టపడి పనిచేసుకోవాలని సూచించారు. స్టార్స్ చేసే శక్తి ప్రేక్షకుల చేతిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.