1. అచ్చెన్నాయుడి విచారణలో ఉత్కంఠ
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై అనిశా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నానికే విచారణ ముగిసిందని అందరూ భావించగా.... అనిశా అధికారులు సాయంత్రం మళ్లీ జీజీహెచ్‌కు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అచ్చెన్నది ఆరంభం మాత్రమే
రాష్ట్రంలో మరిన్ని అరెస్టులు చూస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడిన వారెవరైనా అరెస్టు కాక తప్పదన్నారు. నిజాలు బయటపడతాయని తెదేపా నేతలకు భయంతోనే పట్టుకుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గిరిజనుల కోసం 'వైఎస్ఆర్ పోషణ ప్లస్' పథకం
గిరిజనులకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు వైకాపా సర్కార్ మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. వైఎస్ఆర్ పోషణ ప్లస్‌గా దీనికి నామకరణం చేసింది. ఈ పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సీఎం కార్యాలయ సిబ్బందికి కరోనా.. ఆఫీసుకు సీల్
పుదిచ్చేరి ముఖ్యమంత్రి కార్యాలయంలో సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. దీంతో రెండు రోజుల పాటు ఆఫీసును మూసివేయనున్నట్లు సీఎం నారాయణస్వామి తెలిపారు. బాధితుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సరిహద్దులో యుద్ధ మేఘాలు
చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదం ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు యుద్ధ వాతావారణాన్ని సృష్టిస్తున్న చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ కూడా సమాయత్తమైంది. పెద్దఎత్తున యుద్ధవిమానాలు, హెలికాఫ్టర్లతోపాటు ఆకాష్ వంటి అధునాతన క్షిపణులను కూడా మోహరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'పీవీ' రాజకీయ ప్రస్థానం ఘనం
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పీవీ నరసింహారావు పాత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఆయన రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించిన అంశాలేంటి? ప్రజా జీవితంలోకి ఎప్పుడు అడుగు పెట్టారు. హైదరాబాద్ సంస్థానం విముక్తి తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? వంగర నుంచి దిల్లీ వరకు ఎదిగిన పీవీ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నారు. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా ఆయన పొలిటికల్ ప్రొఫైల్ మీకోసం.
7. 'భారత్‌లో 'గూగుల్ పే'ను నిషేధించలేదు'
దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థకు చెందిన 'గూగుల్ పే'ను.. భారతీయ రిజర్వ్ బ్యాంకు నిషేధించలేదని రిటైల్ చెల్లింపుల సాధికార సంస్థ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)' స్పష్టం చేసింది. చెల్లింపుల వ్యవస్థను నిర్వహించకపోవడం వల్ల అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్‌బీఐ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఆ చైనా కంపెనీలతో జాగ్రత్త
సామ్రాజ్యవాద కాంక్షతో ఉన్న చైనా... సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో చైనా గురించి అమెరికా వెల్లడించిన మరో విషయం మరింత ఆందోళన కలిగిస్తుంది. చైనాకు చెందిన కొన్ని కంపెనీలు ఆ దేశ ప్రభుత్వ, లేదా మిలిటరీ ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాయని... వాటి జాబితాను కూడా విడుదల చేసింది అమెరికా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. అప్పట్లో సచిన్... ఇప్పుడు కోహ్లీ
ఈతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఆటతీరు నచ్చుతుందని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఉమర్ గుల్. అప్పట్లో సచిన్ తెందూల్కర్ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టముండేదని ప్రస్తుతం కోహ్లీ అలాగే ఎదుగుతున్నాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. పోలీసుల క్రూరత్వంపై సెలబ్రిటీల ఫైర్
పోలీసుల అమానుష చర్యల వల్ల తమిళనాడులో తండ్రి, కొడుకుల మరణం దేశంలో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ విషయంపై కొందరు బాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందించారు. బాధితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరిగి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.