- కరోనా కోరల్లో రాష్ట్రం
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,835 కరోనా కేసులు నమోదవ్వగా, 64 మంది మరణించారు. కొత్త కేసులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 5,92,760కి చేరింది. కొవిడ్ మహమ్మారి బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 5,105 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దుర్గమ్మ వెండి రథంలోని మూడు సింహాలు ఎవరు తీసుకెళ్లినట్టు?
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని నాలుగు సింహాల్లో.. మూడు సింహాలు మాయం కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. రథాన్ని పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి... శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తిన విపక్షాలు, ధార్మిక సంస్థలు... ఈ దుర్ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సంక్షోభంలోనూ జీఎస్టీ వసూళ్లలో స్వల్ప వృద్ధి
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయంలో స్వల్ప వృద్ధి నమోదైంది. గత ఏడాది జులైతో పోలిస్తే ఈ సారి జీఎస్టీ వసూళ్లు 35 కోట్ల రూపాయలు అదనంగా పెరిగాయి. మొత్తంగా ఈ ఏడాది జులైలో జీఎస్టీ ఆదాయం 1998.12 కోట్లు వసూలైందని వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సినీఫక్కీలో చోరీ
గుంటూరు జిల్లాలో కొత్త తరహా దొంగతనం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కంటైనర్‌లో రూ.80 లక్షల విలువైన సెల్ఫోన్లను దుండగులు అపహరించారు. కంటైనర్ రన్నింగ్‌లో ఉండగా.. వెంబడించి దోపిడీ చేయడం గమనార్హం. గుంటూరు అర్బన్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కేంద్రం ప్రకటనతో గల్వాన్ వీరులకు అవమానం'
సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్రం తప్పుడు సమాచారం అందిస్తోందని మండిపడింది కాంగ్రెస్. గత ఆరు నెలలుగా భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు జరగలేదన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఒక్క ప్రకటనతో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనలో అమరవీరులైన జవాన్లను కేంద్రం అవమానించిందని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నితీశ్ 'లిక్కర్' అస్త్రం ఫలించేనా?
గ్రామస్థాయి నుంచి దిల్లీ స్థాయి వరకు ఎలాంటి ఎన్నికలు వచ్చిన మహిళా ఓటర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు పోటీ పడుతుంటారు. మగువల ఓటు చలవతో ఏర్పాటైన ప్రభుత్వాలు అనేకం. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. వారిని ఆకర్షించేందుకు సీఎం నితీశ్ కుమార్ ఏం చేయబోతున్నారు? నారీమణులే లక్ష్యంగా అయన సంధించే ఎన్నికల అస్త్రం ఏమై ఉంటుంది? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- నెలకు రూ.50వేలు పెన్షన్ రావాలంటే?
జీవితంలో పదవీవిరమణ అనంతర కాలం అద్భుత సమయం. జీవితంలో ఏ చింతా లేకుండా గడపాల్సిన సమయం కూడా ఇదే. అయితే మలి వయస్సును అనందంగా గడపాలంటే.. అందుకు ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం. ఉద్యోగం ఉన్నప్పుడు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది సాధ్యపడదు. మరి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి అవసరాలు ఉంటాయి? అందుకు ఇప్పుడు పాటించాల్సిన పొదుపు ప్రణాళిక కోసం క్లిక్ చేయండి.
- ట్రంప్ వైపు భారతీయ-అమెరికన్ ఓటర్ల చూపు!
భారతీయ-అమెరికన్ ఓటర్లలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు పెరుగుతున్నట్లు తాజా సర్వే చెబుతోంది. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. అక్కడ ఉండే మన వాళ్లు ఎటువైపు ఉన్నారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్-అమెరికన్ ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ఏఏపీఐ ఈ సర్వే చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫ్యాన్స్ లేకపోతే వీరి జోరుకు బ్రేక్ పడుతుందా?
కొందరు క్రికెటర్లు అభిమానులను చూస్తే మరింత రెచ్చిపోయి ఆడుతుంటారు. అలాంటిది ఈసారి కరోనా వల్ల ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించనుండటం వల్ల వీరి జోరుకు ఏమైనా బ్రేక్ పడుతుందా? లేదా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. ట్యాక్సీ డ్రైవర్ అరెస్ట్
బెంగాలీ హీరోయిన్ మిమీ చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. జిమ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెపై ఆసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో మిమీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.