ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

.

author img

By

Published : Aug 15, 2020, 6:59 PM IST

7 pm top news
7 pm ప్రధాన వార్తలు
  • రాష్ట్రంలో ఆగని కరోనా ఉద్ధృతి
    రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 81 వేల 817కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 87 మంది మృతి చెందగా.. మొత్తం 2,562 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కనకదుర్గ పైవంతెన ప్రారంభానికి కేంద్ర మంత్రికి ఎంపీ ఆహ్వానం
    తెదేపా ఎంపీ కేశినేని నాని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీని కలిశారు. విజయవాడ పైవంతెన ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. విజయవాడ పైవంతెన నిర్మాణానికి 2014లో గడ్కరీ అనుమతి ఇచ్చారని ఎంపీ చెప్పారు. జగన్​ పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లిందని విమర్శించారు. కోర్టు మొట్టికాయలు వేసినా.. ముఖ్యమంత్రి వైఖరిలో మార్పు రాలేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు
    కొన్ని సంఘటనల గురించి చెప్పడానికి మాటలు రావు. రాయడానికి అక్షరాలు సరిపోవు. ఏ తండ్రి అయినా తన కూతురుకు చిన్నదెబ్బ తగిలితేనే తట్టుకోడు. అలాంటిది విశాఖ జిల్లా మన్యంలోని గిరి గ్రామంలో ఓ తండ్రి తన కూతురు మృతదేహాన్ని 3 కిలోమీటర్లు చేతులపై మోసుకెళ్లాడు. కూతురు చనిపోయిందని బాధపడాలో.. ఇంత దీనస్థితిలో బతుకుతున్నామని సిగ్గుపడాలో తెలియని పరిస్థితి. నిజంగా ఇలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదు. పాలకులు మారినా... తమ పరిస్థితి మారదు అని అమాయక గిరిజనులు అంటుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • జనగణమన గీతం.. జపనీయుల శ్రావ్యమైన సంగీతం..!
    'ప్రియమైన భారతదేశమా.. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.. గౌరవిస్తున్నాం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ జాతీయ పతాకానికి సెల్యూట్​ చేస్తున్నాం.' అంటూ భారతదేశంపై తమ అభిమానాన్ని చాటారు. ఆ సంగీత వీడియో కోసం క్లిక్ చేయండి.
  • మహారాష్ట్రలో భూకంపం- కదిలిన ఆనకట్ట
    మహారాష్ట్ర సతారా జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. ఆ సమయంలో రాష్ట్రంలోని అతి పెద్ద కోయానా ఆనకట్ట ప్రాంతం కుదుపునకు గురైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రికార్డు స్థాయి రికవరీ
    దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్నప్పటికీ.. అదే స్ధాయిలో రికవరీలు నమోదవుతున్నాయి. తాజాగా 57 వేల మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 18 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'భారత సరిహద్దులు పూర్తి భద్రం, సురక్షితం'
    భారత సరిహద్దులు పూర్తి భద్రంగా, సురక్షితంగా ఉన్నాయని బీఎస్​, ఐటీబీపీ డైరెక్టర్​ జనరల్​ ఎస్​ఎస్​ దేశ్​వాల్ అన్నారు​. భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలిపారు. అట్టారీ-వాఘా సరిహద్దులో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు దేశ్​వాల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా!
    కరోనా వైరస్ వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విషయాన్ని రష్యా మీడియా సంస్థలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఐపీఎల్​ టైటిల్ స్పాన్సర్​ రేసులో టాటా!
    ఐపీఎల్ 13వ సీజన్​ టైటిల్ స్పాన్సర్​షిప్​కు టాటా మోటార్స్​ బిడ్​ వేసింది. దీంతో పాటు డ్రీమ్​ ఎలెవన్​, అన్​అకాడమీతో పాటు మరికొన్ని సంస్థలు రేసులో ఉన్నాయి. ఇటీవల వివో తప్పుకున్న నేపథ్యంలో ఈ సంస్థలు ముందుకొచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'ఆ ఫ్లాట్​కు సుశాంత్ నుంచి చెల్లింపులు జరగలేదు'
    సుశాంత్​ రాజ్​పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా అతడి 15 కోట్ల లావాదేవీలపై ఈడీ విచారణ కొనసాగుతోంది. అయితే ముంబయి మలాద్​లో రూ.4.5కోట్ల విలువైన ఫ్లాట్​కు సుశాంత్ ఖాతా నుంచి వాయిదాలు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. అది అతడి స్నేహితురాలు అంకిత లోఖండేదని అంటున్నారు. తాజాగా దీనిపై స్పందించింది అంకిత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.