1. లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన
భారత్- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ లద్ధాఖ్లోని లేహ్‌కు వెళ్లారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్.. ప్రధానితో పాటు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రౌడీమూకల కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో దారుణం జరిగింది. రౌడీషీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో... దుండగుడి అనుచరులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అమరులవ్వగా, మరో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దేశంపై కరోనా పడగ
కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 20 వేల 903 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులోనే మరో 379 మంది కొవిడ్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామకృష్ణరాజు
తనపై అనర్హత వేటు, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పదవిని ముణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దు
కాపు రిజర్వేషన్ల అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ రాశారు. గతంలో మద్దతు తెలిపి.. ఇప్పుడు అమలు చేసేందుకు ఎందుకు చేతులు రావట్లేదని నిలదీశారు.
6. చేసింది గోరంత... ప్రచారం కొండంత
వైకాపా ప్రభుత్వం స్కాముల కోసమే స్కీములు పెడుతోందంటూ తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. 108, 104 అంబులెన్సుల విషయంలో ఆడంబర ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అమెరికాలో ఆగని కరోనా విలయం
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. మొత్తం కేసులు కోటీ 9 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 5 లక్షల 24 వేలు దాటింది. అమెరికాలో కొత్తగా 57 వేల కేసులు, 687 మరణాలు సంభవించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. జోష్‌లో మార్కెట్లు
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 36 వేల 50 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కోహ్లీని ఫిట్నెస్ కా బాప్ ఇందుకే అంటారు!
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తాడు. లాక్డౌన్లో పలు కసరత్తులు చేస్తూ కొన్ని వీడియోలు షేర్ చేశాడు. తాజాగా క్లాప్ పుష్అప్స్ చేస్తోన్న వీడియోను తన సోషల్‌మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు విరాట్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. చిరంజీవి రిమేక్‌లో జగపతిబాబు?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.