- పండగ రోజునా పోరాటం.. భోగి మంటల్లో అమరావతి వ్యతిరేక చట్టాల దహనం
తెలుగింటి పండుగను రాజధాని గ్రామాల రైతులు ఘనంగా నిర్వహించారు. నేటి భోగి మంటలు.. కారాదు అమరావతి చితిమంటలు.. పేరుతో నిరసన కొనసాగించారు. అమరావతికి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాల ప్రతులను భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వామపక్షాల భోగి మంటలు.. వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా భోగి మంటలు వేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వైఖరిని ఖండించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఉభయగోదావరి జిల్లాల్లో కోళ్ల పందేలకు జోరుగా ఏర్పాట్లు
సంక్రాంతికి పందెం కోడి కాలు దువ్వుతోంది. కత్తిగట్టి కయ్యానికి... సై అంటోంది. న్యాయస్థానం ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ... ఉభయగోదావరి జిల్లాల్లో వందల సంఖ్యలో బరులు సిద్ధమయ్యాయి. ఎల్ఈడీ తెరలు, డ్రోన్ కెమెరాలతో..... నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. రెండు జిల్లాల్లోనే దాదాపు వెయ్యికోట్లు చేతులు మారే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కిడ్నాప్ కేసులో మూడో రోజు అఖిలప్రియ విచారణ
కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు ఇవాళ మూడో రోజు విచారించనున్నారు. ఆమెతో పాటు అదుపులోకి తీసుకున్న మరో 8 మందిని సైతం పూర్తిస్థాయిలో ప్రశ్నించనున్నారు. వీరంతా... గ్యాంగ్ సినిమా చూసి బాధితులను ఎలా కిడ్నాప్ చేశారన్న వివరాలు ఆరా తీయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీకా వేయాలంటే... ఓటీపీ ఉండాల్సిందే!
కొవిడ్ టీకాను వేయటంలో కొవిన్ యాప్ కీలకం. టీకా వేయించుకునేవారి సెల్‌ఫోన్ నంబర్లు ఆధార్‌తో అనుసంధానం కావడం తప్పనిసరి. ఆధార్ కార్డుకు అనుసంధానమైన సెల్‌ఫోన్ నంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేశాకే ఇతర వివరాలు నమోదయ్యేలా యాప్ రూపొందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో 16వేల దిగువకు కరోనా కొత్త కేసులు
దేశవ్యాప్తంగా కొత్తగా 15,968 మంది కరోనా బారిన పడ్డారు. మరో 202 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 17వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 96.43శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- '25వ సవరణతో నాకేం ముప్పు లేదు.. కానీ'
25వ రాజ్యాంగ సవరణతో తనకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ, అది జో బైడెన్, ఆయన పరిపాలన విభాగాన్ని వెంటాడుతుందని హెచ్చరించారు. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత తొలి పర్యటన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు ట్రంప్. మరోవైపు.. ట్రంప్‌పై 25వ సవరణను ప్రయోగించాలన్న నిర్ణయాన్ని తోసిపుచ్చారు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న బుల్ జోరు- గరిష్ఠాలకు సూచీలు
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 246 పాయింట్లకు పైగా పెరిగి.. 49,763 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లకుపైగా లాభంతో 14,627 వద్ద కొనసాగుతోంది. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- రహానె.. నీ వ్యూహం అద్భుతం: హాడిన్
భారత తాత్కాలిక టెస్టు కెప్టెన్ రహానెపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాళ్లంతా గాయాలపాలవుతున్నా.. సమర్థవంతంగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడని కొనియాడాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈసారి మంట మామూలుగా ఉండదు: రామ్
టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందిన కొత్త చిత్రం 'రెడ్'. సంక్రాంతి కానుకగా జనవరి 14(గురువారం)న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సినిమాతో తాను మరో హిట్ అందుకోనున్నట్లు హీరో రామ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.