- మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అనిశా అరెస్టు చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఆయనను అరెస్టు చేసిన అధికారులు... విశాఖలోని కోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయవాడ కోర్టుకు అచ్చెన్న
అచ్చెన్నాయుడిని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నట్లు అనిశా అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చంద్రబాబు మండిపాటు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టును చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ చర్య జగన్ కుట్ర అని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కడసారైనా చూడలేదు
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ మహిళ కన్నబిడ్డలను చూడకముందే కన్నుమూసింది. ఆమె కరోనా సోకి మరణించినట్లు అధికారులు నిర్ధరించారు. కుటుంసభ్యులకు సైతం ఆమెను కడసారి చూసుకునే అవకాశం దక్కలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్‌కు భారత్ దీటైన సమాధానం
నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ సెక్టార్లో పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న దాయాది దేశానికి సరైన గుణపాఠం నేర్పినట్లు స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వలస కమిషన్‌తో కష్టాలు తీరేనా?
వలస కార్మికుల అవస్థలపై ప్రధాని మోదీ.. మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో 'వలస కమిషన్' ఆలోచనను పంచుకున్నారు. వలస కార్మికుల్లోని నైపుణ్యాలను గుర్తించి, వారికి స్వస్థలాలోనే ఉపాధి కల్పించే ప్రయత్నాలు సఫలమవుతాయా? ఇది కోటి డాలర్ల ప్రశ్న? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా కరాళ నృత్యం
ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మొత్తం కేసుల సంఖ్య 76 లక్షలకు చేరువైంది. 4.23 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్, బ్రిటన్ దేశాల్లో మరణాల సంఖ్య 41 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమెరికా దెబ్బకు దేశీయ సూచీలు విలవిల
వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 780 పాయింట్లకు పైగా నష్టంతో 32,754 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 220 పాయింట్లకుపైగా కోల్పోయి 9,675 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బౌలర్లు రోబోలు అవుతారు
బంతిపై లాలాజలం పూయడం నిషేధిస్తే రోబోలకు బౌలర్లకు తేడా ఉండదని అభిప్రాయపడ్డాడు మాజీ బౌలర్ అక్రమ్. ఈ నిబంధన వల్ల బ్యాట్స్‌మెన్ ఎంతో లాభపడతారని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రజినీకాంత్‌కు తల్లిగా శ్రీదేవి
అతిలోకసుందరి శ్రీదేవి.. సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఓ సినిమాలో తల్లిగా నటించారట. అదీ ఆమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడు. ఇంతకీ ఆ చిత్రమేమిటంటే?