- పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు
తెలుగుదేశం అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు విమానాశ్రయంలోపలే బైఠాయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డు రాని కరోనా.. చంద్రబాబు పర్యటనకు అడ్డొచ్చిందా?'
తిరుపతి విమానాశ్రయంలో అధినేత చంద్రబాబు నిర్భంధాన్ని తెదేపా నేతలు ఖండించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని నిర్బంధించడం ఏంటని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి కొవిడ్ తాత్కాలిక ఉద్యోగుల యత్నం
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు కొవిడ్ తాత్కాలిక ఉద్యోగులు యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రేమించి పెళ్లికి నిరాకరణ- జైల్లోనే తాళి కట్టించిన అధికారులు
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఓ యువకుడు. అయితే అతడికి జైలులోనే ఆమెతో వివాహం జరిపించారు అధికారులు. ఇంతకీ ఏమైందో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- వ్యాక్సినేషన్ 3.0: నమోదు ఎలా? టీకా కేంద్రం ఎక్కడ?
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు టీకా పంపిణీ ప్రారంభమైంది. కొవిన్ 2.0 పోర్టల్, ఆరోగ్య సేతు యాప్ ద్వారా టీకా కోసం పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- కేంద్రం చెప్పుచేతల్లో తమిళ సీఎం: రాహుల్
తమిళనాడులో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం చెప్పుచేతల్లో పని చేస్తున్నారని విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భారత్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ విప్లవం అవసరం'
భారత్‌లో ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ విప్లవం అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2021-22 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులపై నిర్వహించిన వెబినార్‌లో ఈ విషయం పేర్కొన్నారు. బడ్జెట్లో పశు సంవర్ధక, పాడి, చేపల పెంపకానికి ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మా నౌకపై దాడి చేయించింది ఇరానే'
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆరోపణలు చేశారు. గత వారం తమ దేశ కార్గో నౌకలో జరిగిన పేలుడుకు ఇరానే కారణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పిచ్‌పై విమర్శలు ఆపండి.. ఆటపై దృష్టి పెట్టండి'
భారత్‌లోని పిచ్‌లపై ఆరోపణలు చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుపై మండిపడ్డాడు దిగ్గజ క్రికెటర్ రిచర్డ్స్. వెళ్లే ముందు పిచ్‌ల గురించి తెలియాదా అని వారిని ప్రశ్నించాడు. ఆడకుండా పిచ్‌ను నిందించడం సరికాదని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ప్రశ్నించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేవరకొండ బ్రదర్స్ 'పుష్పక విమానం'.. సెట్లో దిశా పటానీ
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో పుష్పక విమానం, రొమాంటిక్, ఏక్ విలన్ రిటర్న్స్, ఎనిమల్ చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.