ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1pm - ఏపీ న్యూస్

.

1 pm top news
1 pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 24, 2020, 12:58 PM IST

  • రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతల గృహ నిర్బంధం

త్తూరు జిల్లాలో రెండో రోజూ భాజపా, తెదేపా నేతల గృహనిర్బంధం కొనసాగుతోంది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా భాజపా నేతలు ఆందోళనకు సిద్ధమైన క్రమంలో బుధవారం పోలీసులు నేతలను గృహ నిర్బంధం చేశారు. సీఎం జగన్ తిరుమల పర్యటన ముగిసే వరకు వారి నిర్బంధం కొనసాగేలా కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాజధాని అంశంపై సీఎంకు లేఖ రాస్తా: కేంద్రమంత్రి అథవాలే

రాజధాని అంశంపై సీఎం జగన్ కు లేఖ రాయనున్నట్లు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. అమరావతి మహిళా ఐకాస నేతలు మంత్రిని కలిసి అమరావతి అంశం వివరించారు. రాజధానిగా అమరావతికి తన మద్దతు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చర్చిలో విగ్రహాలు ధ్వంసం.. పోలీసుల దర్యాప్తు

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఇటీవల జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అభయాంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద హుండీ పగులగొట్టిన ఘటన మరువక ముందే.. ఆర్సీఎం చర్చి వద్ద విగ్రహాలను దుండగులను ధ్వంసం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వివేకా హత్య కేసు: చెప్పుల దుకాణం యజమానిని విచారిస్తున్న సీబీఐ

వివేకా హత్య కేసులో 13వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల చెప్పుల దుకాణం యజమాని మున్నాను కడప జైలు అతిథి గృహంలో విచారిస్తున్నారు. మరో ఐదుగురిని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష

అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉన్న పృథ్వీ-2 క్షిపణి పరీక్షలను సైన్యం నిర్వహించింది. రాత్రి వేళ ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించినట్లు డీఆర్​డీఓ తెలిపింది. చీకట్లో క్షిపణి తీరును పర్యవేక్షించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోజం విజయవంతంగా ముగిసినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొత్త బిల్లులతో రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు లబ్ధి పొందుతారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. వ్యాపారులు, రైతుల మధ్య అవగాహన పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. ఈ సంస్కరణలు రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా అంతమైనా 'వర్క్​ ఫ్రం హోం' సంప్రదాయం

కరోనా వైరస్ అంతం అనంతరం కూడా చాలా కంపెనీలు.. వర్క్​ ఫ్రం హోం సంప్రదాయాన్ని కొనసాగించే వీలుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్ అంచనా వేశారు. ప్రస్తుతం ఈ పద్దతి మంచి ఫలితాలు ఇస్తుండటమే ఇందుకు కారణంగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శాంతియుత అధికార బదిలీకి ట్రంప్​ నిరాకరణ​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. నవంబర్​ 3న జరిగే ఎన్నికల్లో ఓడిపోతే శాంతియుతంగా అధికార బదిలీకి పాల్పడేందుకు నిరాకరించారు. మెయిల్​ ఇన్​ ఓటింగ్​ విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ట్రంప్​.. మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోల్​కతా నైట్​రైడర్స్.. 2012 తర్వాత ఇదే తొలిసారి!

ముంబయి ఇండియన్స్​తో జరిగిన తన తొలి మ్యాచ్​లో ఓటమిపాలైంది కోల్​కతా నైట్​రైడర్స్. అయితే ఈ మ్యాచ్ ద్వారా తన పేరిట ఉన్న ఓ రికార్డును కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కంగనకు ఎందుకు సమన్లు ఇవ్వడం లేదు?

చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో డ్రగ్స్​కు బానిస అయ్యానంటూ ఇటీవలే కంగనా రనౌత్​ ఓ వీడియోలో వెల్లడించారు. కాగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు కంగన స్వయంగా చెప్పినా.. ఎన్​సీబీ అధికారులు ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదని కాంగ్రెస్​ నాయకురాలు నగ్మా ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.