- రాజధాని అంశంపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
రాజధాని అంశంపై, కేంద్రం తరఫు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధి అంశమని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వేతనాలు చెల్లించాలని సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన
తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. తమను నియమించిన గుత్తేదారు సంస్థ 3నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేడు హైకోర్టులో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లు రద్దు పిటిషన్లపై విచారణ
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లు రద్దుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, హైకోర్టు శాశ్వత భవనాలపై వేసిన పిటిషన్లపైనా విచారణ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెపో, రివర్స్ రెపో రేట్లు యథాతథం.. ఆర్బీఐ ప్రకటన
కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ప్రస్తుత రెపో రేటు 4 శాతంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత సరిహద్దు సమీపంలో నేపాల్ హెలిప్యాడ్ల నిర్మాణం
భారత సరిహద్దు సమీపంలో నేపాల్ ప్రభుత్వం మూడు హెలిప్యాడ్లను నిర్మిస్తోంది. బిహార్ వాల్మీకి నగర్లో రెండు, ఉత్తర్‌ప్రదేశ్ సమీపంలో మరో హెలిప్యాడ్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు
ముక్కుపచ్చలారని పసికందును బావిలో పడేశారు కర్ణాటకకు చెందిన ఆ కర్కశ తల్లిదండ్రులు. ఆపై తమ కూతురిని ఎవరో హత్య చేశారని పెద్ద నాటకమే ఆడారు. చివరికి ఆడపిల్ల పుట్టిందని తామే చంపేశామని అంగీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కర్ణాటకకు భారీ వర్ష సూచన- రెడ్ అలర్ట్ జారీ
కర్ణాటకలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. విపత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే అవసరమైన నిధులను ఆయా జిల్లాలకు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హిరోషిమా మృతులకు జపాన్ ప్రధాని నివాళి
హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగి గురువారానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నాడు బాంబుదాడిలో మృతిచెందిన వారికి జపాన్ ప్రధాని నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దిగ్గజ క్రికెటర్ లారాకు కరోనా సోకిందా?
కరోనా బారిన పడ్డాడనే వార్తలపై స్పందించిన లారా.. తాను పరీక్షలు చేసుకున్నానని, అయితే నెగటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'హిట్, ఫ్లాఫ్‌ల గురించి అసలు పట్టించుకోను'
నటిగా గుర్తింపు తెచ్చుకోవడం తనకు ఇష్టమని చెబుతూనే.. పరిశ్రమలో తాను విజయాలను, వైఫల్యాలను ఒకే విధంగా చూస్తానని అంటోంది ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.