- లైవ్ అప్డేట్స్: అయోధ్యలో రామమందిర భూమిపూజ
అయోధ్యలో జరుగుతున్న రామమందిర భూమిపూజ లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి?
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్... అయోధ్యలో కొత్తగా కొలువుదీరనున్న రామమందిరానికి దశ-దిశ చూపుతుంది ఇదే. నిర్మాణ దశలోనే సంరక్షణ చేపడుతూ.. సకల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఆలయ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటమే కాదు... భూమిపూజకు అతిథులకు ఆహ్వాన పత్రికలు అందించటం మొదలు.. ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించటం వరకు అన్నీ ట్రస్టు బాధ్యతలే. శ్రీరామ జన్మభూమి సంరక్షణ మొత్తం ఇక ఆ ట్రస్టు అధీనంలోనే ఉంటుంది. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి..? ఎలా ఏర్పడింది ? ఎవరి ఆధ్వర్యంలో ఉంది ? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- వకుళమాత ఆలయం వద్ద బయటపడ్డ పురాతన శాసనం
తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న వకుళమాత ఆలయంలో చారిత్రక శాసనం బయట పడింది. పేరూరు గ్రామంలో వకుళ మాత ఆలయ అభివృద్ధి పనులు చేస్తుండగా శాసనం కనిపించింది. అది 11వ శతాబ్దంలో నాటి చోళ రాజు మొదటి కులోత్తంగ చోళుడు తమిళంలో జారీ చేసిన శాసనంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐఎస్బీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం
హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఏపీ ప్రభుత్వ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గౌతంరెడ్డి, ఐఎస్‌బీ ప్రతినిధులు పత్రాలు మార్చుకున్నారు. ప్రభుత్వ శాఖల ఆర్థిక పురోగతిపై ఐఎస్‌బీ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపైనా ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చంద్రబాబు సై అంటే కరోనా అంటూ కపటనాటకాలెందుకు
కడపలో సీబీఐ దిగేసరికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కొవిడ్ నెగిటివ్ వచ్చినా.. పాజిటివ్ అంటూ తెలంగాణలోని ఆస్పత్రిలో చేరారని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. అమరావతికి మద్దతుగా చంద్రబాబు రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డే కదా డిమాండ్ చేసింది అని గుర్తుచేశారు. తీరా చంద్రబాబు సై అంటే కరోనా అంటూ కపటనాటకాలెందుకని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్-చైనా చర్చల పురోగతికి అడ్డుగా పాంగాంగ్!
భారత్- చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నా పాంగాంగ్ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉంది. పాంగాంగ్ సరస్సు ఉత్తర ప్రాంతం ప్రధాన అడ్డంకిగా ఉంది. ఫింగర్ 5 ప్రాంతం నుంచి చైనా మరింత వెనక్కి వెళ్లే అవకాశమున్నా... ఫింగర్ 4 లో స్థావరాన్ని ఖాళీ చేయడానికి చైనా నిరాకరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డేటా సెంటర్ల డిమాండ్‌తో స్థిరాస్తి రంగం పరుగు!
కరోనా వల్ల స్థిరాస్తి రంగం తీవ్రంగా నష్టపోయింది. అయితే ఇదే సమయంలో డేటా సెంటర్లకు పెరిగిన డిమాండ్.. స్థిరాస్తి రంగానికి కలిసిరానున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తాజా నివేదికలో వెల్లడించింది. లాక్డౌన్లో డేటా సెంటర్ల సామర్థ్యం 25-35 శాతం పెరగటమే ఇందుకు ఉదాహరణగా తెలిపింది. డేటా సెంటర్ల వ్యాపారంతో స్థిరాస్తి రంగానికి వార్షికంగా అద్దెల ద్వారా 10-14 శాతం ఆదాయం వస్తుందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా కాలంలోనూ ఆ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు
కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడ్డ శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. వైరస్ విజృంభణ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యూఎస్ ఓపెన్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్
కరోనా కేసులు ఎక్కువవుతున్న ఇలాంటి సమయంలో ప్రయాణం చేయడం సరికాదని, అందుకే యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు నాదల్ స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రామరాజ్యం వచ్చేస్తుంది.. బంగారు కల నెరవేరబోతుంది'
రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన పట్ల సీనియర్ నటుడు సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి హృదయం పులకించిపోతోందని అన్నారు. ఇదే విషయమై మాట్లాడిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. 'శ్రీ రామదాసు' దర్శకుడిగా తన జన్మధన్యమైందని చెప్పారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపనతో భారతీయుల బంగారు కల నెరవేరబోతుందని పేర్కొన్నారు. రామరాజ్యం వచ్చేస్తుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.