ETV Bharat / city

'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం' - ఈటీవీకి 25 వసంతాలు

25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీ రజతోత్సవాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా నిర్వహించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుతో పాటు మూడో తరం కుటుంబసభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది నడుమ ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు జరిగాయి.

etv-25-years-celebrations-in-ramoji-film-city
'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'
author img

By

Published : Aug 27, 2020, 4:55 PM IST

'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ఈటీవీ 25 ఏళ్లు ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుతో పాటు ఈటీవీ ఛానెల్స్‌ సీఈవో బాపినీడు, యాజమాన్య ఉన్నతాధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగులు వేడుకల్లో పాల్గొన్నారు. ఫిల్మ్‌సిటీ ఎండీలు, రామ్మోహన్‌రావు, విజయేశ్వరి, ఈనాడు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ హాజరయ్యారు. రామోజీరావు కుటుంబానికి చెందిన మూడోతరం కుటుంబసభ్యులు... సహరి - రేచస్‌, సోహన - వినయ్‌, బృహతి, సుజయ్‌ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

ఉద్యోగులతో ముచ్చటించిన రామోజీరావు

రామోజీరావు మనవడు, సుమన్‌ తనయుడు సుజయ్‌ చేత... మనవరాళ్లు కేక్‌ కట్‌ చేయించారు. ఈటీవీ పాతికేళ్ల ప్రయాణంలో భాగస్వామ్యులైన ఉద్యోగులతో రామోజీరావు ముచ్చటించారు. ఈటీవీ రజతోత్సవంలో నెట్‌వర్క్‌ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ పి.కె.మాన్వీ, ఈటీవీ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ అజయ్‌శాంతి, కంపెనీ సెక్రటరీ జి.శ్రీనివాస్, ఈనాడు డైరెక్టర్‌ ఐ.వెంకట్‌, గ్రూప్‌ హెచ్​ఆర్​-ప్రెసిడెంట్‌ గోపాలరావు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

ఈటీవీ రజతోత్సవ వేళ.. తారల శుభాకాంక్షల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.