డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంక్) బ్రాంచ్ల విస్తరణపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలో డీసీసీబీ శాఖ ఏర్పాటు చేస్తామని మంత్రి కన్నబాబు వివరించారు. రాష్ట్రంలో 49 శాతం మండలాల్లో 675 డీసీసీబీ శాఖలున్నాయన్న కన్నబాబు... మరో 332 మండలాల్లో దశలవారీగా విస్తరిస్తామని చెప్పారు.
వ్యవసాయ, ఇతర పథకాల అమలుకు పారదర్శక వ్యవస్థ రూపొందిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సులభతర రుణ సౌకర్యం, రుణాల చెల్లింపు విధానాలపై చర్చించారు. మహిళా సంఘాలు, కౌలు రైతులకు అధిక రుణాలకు ప్రాధాన్యం కల్పిస్తామని కన్నబాబు వెల్లడించారు.
ఇదీ చదవండీ... ఆనందయ్య మందుపై శాస్త్రీయ పరిశీలన చేయించాలి.. కేంద్ర ఆయుష్ శాఖకు సోము వీర్రాజు లేఖ