![essential goods distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6855903_303_6855903_1587307508723.png)
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారికి చేయూత నిచ్చేందుకు దాతలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్న జీప్ డ్రైవర్లకు వైకాపా నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా వైకాపా నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, చంద్రమౌళి, సుధాకర్ రెడ్డిలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కోడిగుడ్లు పంచిన జనసేన నేత
![eggs distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6855903_135_6855903_1587307970033.png)
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, పొందూరు మండలాల్లో స్థానిక నియోజకవర్గ జనసేన కన్వీనర్ పేడాడ రామ్మోహనరావు కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పేదవారికి తోడుగా ఉండేందుకు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
నాయిబ్రహ్మణులకు, కళాకారులకు చేయూత
![essential goods distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6855903_252_6855903_1587308459076.png)
విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయిబ్రహ్మణులకు, కళాకారులకు నిత్యావసర సరుకులు పంపణీ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో సీతమ్మధార బీఎస్. లే అవుట్లో వస్తువులను పేదవారికి అందించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు.
గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ
![essential goods distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6855903_910_6855903_1587309219868.png)
విశాఖ మన్యం మారుమూల ఆదివాసి గిరిజన పీటీజీ తెగ వారికి నిత్యావసర సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధను అర్థం చేసుకున్న వాసన్, లయ స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలుస్తున్నాయి. పెదబయలు మండలం పులిగొంది గ్రామంలో 73 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు.
పేదవారిని గుర్తించి అన్నదానం
![food distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6855903_774_6855903_1587309292155.png)
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట 'సప్లయర్స్ అసోసియేషన్' ఆధ్వర్యంలో 500 కుటుంబాలకు భోజన పొట్లాలను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని పేద కుటుంబాలను గుర్తించి వారికి అన్నదానం చేశారు.
కూరగాయలు పంచిన ఎస్ఎస్ ఫౌండేషన్
![vegetables distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6855903_653_6855903_1587310192928.png)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయటంతో పనుల్లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు లో ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని గిరిజనులకు కూరగాయలను పంపిణీ చేశారు.
మూడు విడతల్లో 15 కేజీల బియ్యం
![rice distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6855903_271_6855903_1587310283020.png)
లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించే బియ్యం, శనగలు పంపిణీ కార్యక్రమం గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగింది. తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మూడు విడతల్లో 15 కేజీలు బియ్యం కందిపప్పు, శనగలు అందిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి హాజరైన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.
ఇదీ చూడండి: