CS Sameer Sharma: మూడేళ్లుగా బకాయి ఉన్న డీఏ, పీఆర్సీ అరియర్స్ను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జీవో, ఏపీఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకపోవటం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. డీఏ అరియర్లను చెల్లించకుండా ఉద్యోగుల వేతనాల నుంచి ఆదాయపు పన్ను మినహాయించడంపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ ను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రెండు డీఏలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని కోరారు. పీఆర్సీ సిఫార్సుల మేరకు కేడర్ పే స్కేల్స్‌పై అన్ని శాఖలకూ ఉత్తర్వులు పంపాలని సీఎస్ ను కోరారు.
ఇవీ చదవండి: