ETV Bharat / city

కరెంటు కొనుగోలు.. రెండు నెలల్లోనే అన్ని కోట్ల ఖర్చా? - ఏపీ విద్యుత్ డిస్కంలు

విద్యుత్ సమస్య రాష్ట్రాన్ని తీవ్రంగా వేధిస్తోంది. అవసరాలు తీర్చడానికి.. గ్రిడ్ నిర్వహణకు.. డిస్కంలు ఆపసోపాలు పడుతున్నాయి. బయటి నుంచి విద్యుత్ కొనేందుకు.. కేవలం రెండు నెలల్లోనే వందల కోట్లను వెచ్చించడం గమనార్హం.

electricity problems in ap
electricity problems in ap
author img

By

Published : Oct 15, 2021, 11:56 AM IST

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడానికి, గ్రిడ్‌ నిర్వహణకు డిస్కంలు ఆపసోపాలు పడుతున్నాయి. గత రెండు నెలల్లోనే బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలుకు రూ.932 కోట్లను వెచ్చించాయి. విద్యుత్‌ ఎక్స్ఛేంజ్‌ వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. డిస్కంలు ఆగస్టులో 825 మిలియన్‌ యూనిట్ల (ఎంయూలు) కొనుగోలుకు రూ.495 కోట్లను వెచ్చించాయి. సెప్టెంబరులో రూ.437 కోట్లతో 821 ఎంయూలు కొన్నాయి. ఈ లెక్కల ప్రకారం యూనిట్‌కు సగటున ఆగస్టులో రూ.6, సెప్టెంబరులో రూ.5.40 వంతున వెచ్చించాయి. యూనిట్‌కు 20 పైసల వరకు ఇతర ఛార్జీలు పడతాయి. బొగ్గు కొరత కారణంగా జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లు కొన్ని మూతపడటం, మిగిలినవాటి నుంచి పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్‌ అందకపోవటంతో డిమాండ్‌కు తగ్గట్టుగా కరెంటు అందడం లేదు. దీంతో.. బేస్‌ లోడ్‌ నిర్వహణ, గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) ఎప్పటికప్పుడు విద్యుత్‌ సర్దుబాటుకు కసరత్తు చేస్తోంది.

డిమాండ్‌ 9వేల మెగావాట్లు..
విద్యుత్‌ డిమాండ్‌లో 50 శాతం గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ కింద ఉండాలి. డిమాండ్‌లో హెచ్చుతగ్గులు 2.5 శాతానికి మించకూడదు. అంతకు మించితే గ్రిడ్‌కు సమస్య ఎదురవుతుంది. పెరిగిన అవసరాల నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ 9 వేల మెగావాట్లకు చేరింది. ఇందులో 50 శాతం గ్రిడ్‌కు సరఫరా ఉండేలా ఉత్పత్తి సంస్థలు అందించాలి. దీనికి అనుగుణంగా ఎస్‌ఎల్‌డీసీ లోడ్‌ ప్రణాళికను ఉత్పత్తి సంస్థలకు అందిస్తుంది. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో కరెంటు అందకపోవడంతో అప్పటికప్పుడు బహిరంగ మార్కెట్‌లో కొనాల్సి వస్తోంది. పీక్‌ డిమాండ్‌ సమయంలో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ దొరకటమే కష్టంగా ఉందని ఒక అధికారి తెలిపారు.

అన్ని ప్లాంట్ల నుంచి ఉత్పత్తికి ప్రయత్నాలు..
కడపలోని రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు (ఆర్‌టీపీపీ) నుంచి 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంటును వినియోగంలోకి తేవాలని ఏపీ జెన్‌కో నిర్ణయించింది. ఈ ప్లాంటు ఉత్పత్తిలోకి వచ్చి సుమారు ఆరేళ్లు గడిచినా పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు. దీనికి యంత్రాలను సరఫరా చేసిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) ఇప్పటి వరకు వాటి పనితీరును పరిశీలించలేదు. దీనికోసం ఆ సంస్థ నిపుణులు ప్లాంటుకు వచ్చారు. ఒకట్రెండు రోజుల్లో ప్లాంటును పూర్తి ఉత్పత్తి సామర్థ్యంలో ఉంచి పరీక్షిస్తారు. ఈ సమయంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. ఈ రూపేణా 600 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. దీని కోసం సుమారు 40 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఇక్కడ 73 వేల టన్నుల నిల్వలున్నాయి.

* కృష్ణపట్నంలో 800 మెగావాట్ల సామర్థ్యమున్న రెండో యూనిట్‌ నుంచి సుమారు 500 మెగావాట్ల విద్యుత్‌ వస్తోంది. ప్రస్తుతం కృష్ణపట్నంలో 1.01 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉంది. సుమారు రెండు వారాలపాటు రెండు ప్లాంట్ల నుంచి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

* విజయవాడలోని వీటీపీఎస్‌లో నిర్వహణ కోసం ఉత్పత్తి నిలిపేసిన 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటును ఐదారు రోజుల్లో వినియోగంలోకి తేనున్నారు. దీంతో జెన్‌కో థర్మల్‌ విద్యుదుత్పత్తి ప్రస్తుతం ఉన్న 2,500 నుంచి సుమారు 3,500 మెగావాట్లకు చేరుతుందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: పొలాల్లోకి దూసుకెళ్లిన మంత్రి కాన్వాయ్.. తప్పిన ప్రమాదం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.