ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం పలు ఆదేశాలిచ్చింది. అధికారిక వెబ్‌సైట్లు, ప్రభుత్వ భవనాలపై బహిరంగ ప్రదర్శనలు నిషేధమని తెలిపింది. ఎన్నికల కోడ్‌ను నిష్పక్షపాతంగా అమలుచేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ వెల్లడించారు.
- ప్రకటనలపై ఫోటోలు, సందేశాలు ప్రదర్శించడం నిషేధం
- అధికారిక వెబ్‌సైట్లు, ప్రభుత్వ భవనాలపై బహిరంగ ప్రదర్శనలు నిషేధం
- ప్రభుత్వ వ్యయంతో విగ్రహాలు, ఛాయాచిత్రాలు, సందేశాల ప్రదర్శనకు వీల్లేదు
- ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మంత్రులు, రాజకీయ నేతల చిత్రాలను తొలగించాలి
- ప్రభుత్వ భవనాల్లో ప్రధాని, సీఎం, మంత్రుల చిత్రాలను ప్రదర్శించకూడదు.
కోడ్ వర్తించని అంశం
రాష్ట్రపతి, గవర్నర్, జాతీయ నాయకులు, కవుల చిత్రాలకు కోడ్ వర్తించదు.
ఎన్నికల కమిషన్ సూచనలు ఇప్పటి వరకు అమలు చెయ్యనట్లయితే వెంటనే అమలు చేయలని అధికారులకు ఎస్ఈసీ ఆదేశిచ్చింది. ఎన్నికల కమిషన్ సూచనలను అతిక్రమించి, వాటి అమలులో అధికారులు లోపభూయిష్టంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: పుర సంగ్రామం: రేపటి నుంచే నామినేషన్ల పర్వం