ఏపీ విద్యా చట్టం సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. మండలిలో ప్రతిపాదించిన సవరణలు శాసనసభలో వీగిపోయాయి. అంతకు ముందు ఆంగ్ల మాధ్యమంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో పేదవారు సైతం నెగ్గాలంటే ఇంగ్లిష్ మీడియం అవసరమన్నారు. పేద విద్యార్థుల కోసమే రైట్ టు ఇంగ్లిష్ విధానం తీసుకొచ్చామన్నారు. విద్యా కానుక పథకం కింద రూ.1350ల విలువైన కిట్‌ను విద్యార్థులకు అందిస్తామన్నారు. జూన్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు
ఇంగ్లిష్ మీడియం బిల్లును కౌన్సిల్‌లో అడ్డుకున్నారని.. పేదవారికి మేలు చేసే బిల్లును ఎందుకు అడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు సీఎం. సవరణలు చేస్తూ అసెంబ్లీకి తిప్పి పంపారు. మళ్లీ ఇక్కడ ఆ బిల్లును ఆమోదిస్తున్నాం. ఇప్పుడు మళ్లీ మండలికి పంపుతాం. అసెంబ్లీలో ఆమోదం పొందితే మండలిలో అడ్డుకోవడానికి ఏమీ ఉండదని అన్నారు.