మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన... ఎమ్మెల్సీ స్థానానికి.. నామినేషన్ దాఖలుకు ఆగస్టు 13 తేదీని తుదిగడువుగా పేర్కొంటూ.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 24 తేదీన పోలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జులై 1వ తేదీన శాసనమండలి సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. 2023 మార్చి వరకూ ఆయన పదవీ కాలం ఉన్నప్పటికీ ముందస్తుగా రాజీనామా చేయటంతో ఈ ఖాళీ ఏర్పడినట్టు ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొంది. ఆగస్టు 26 తేదీలోపు ఉపఎన్నికల ప్రక్రియను ముగించాల్సిందిగా ఈసీ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అక్టోబరు 15న కళాశాలలు తెరవాలి: సీఎం జగన్