EAMCET and ECET dates announced: తెలంగాణలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్.. అదేవిధంగా పీజీలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు ఎంసెట్, ఈసెట్ నిర్వహణ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.
జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్.. 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష జరగనుంది. జులై 13న ఈసెట్ నిర్వహించననున్నారు.
ఇదీ చదవండి: Intermediate Exams Schedule 2022: ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల