ETV Bharat / city

వయసును తగ్గించే డ్రైఫ్రూట్స్.. మీరు వీటిని తింటున్నారా!

Dry Friuts: వయసును ఎలా తగ్గిస్తారు అనుకుంటున్నారా! వయసు వచ్చినా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటమే వయసు తగ్గించుకోవటం. చాలామంది వయసు మళ్లిన ఛాయలు కనిపించకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఆ ప్రయత్నం ఆరోగ్యంగా ఉంటే ఎంత బాగుంటుంది. మనం తీసుకునే ఆహారమే మనకు సహాయపడుతుంది. అవేంటో తెలుసుకుందామా!

dry fruits
డ్రైఫ్రూట్స్
author img

By

Published : Oct 18, 2022, 8:13 AM IST

Dry Friuts: చాలామంది వయసు మళ్లిన ఛాయలు కనిపించకుండా ఉండేందుకు ఎన్నో రకాల ట్రీట్‌మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. వేలకు వేలు డబ్బులు పెట్టినా ఫలితాలు రాక నష్టపోయిన వారున్నారు. మనం తినే ఆహారంతో ఆరోగ్యం సొంతమైతే ఇతర ట్రీట్‌మెంట్ల అవసరమేముంటుంది? కాబట్టి రుచిగా ఉండి ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవటం మంచిది.

బాదం: ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో బాదం ఒకటి. ఇందులో ఉండే విటమిన్‌ ఈ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది.

పిస్తా: పిస్తాల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు చర్మంపై మొటిమలు రాకుండా సహాయపడతాయి.

జీడిపప్పు: శరీరానికి కావాల్సిన మినరల్స్‌, అమైనో ఆమ్లాలు, ఫైబర్‌ జీడిపప్పులో పుష్కలంగా దొరుకుతాయి. వీటిని నేరుగా కూడా తీసుకోవచ్చు.

డేట్స్:

* తక్షణ శక్తిని అందించే వాటిల్లో డేట్స్ ఒకటి. ఇవి రోజూ తినటం వల్ల ఉత్సాహంగా ఉంటారు.

* ఉదయం లేవగానే నానబెట్టిన బాదం పలుకులు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్నాక్స్‌గా డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి.

* డ్రైఫ్రూట్స్ తో లడ్డూ చేసికొని తిన్నా మేలే.

* జీడిపప్పుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.

* బయట ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. బ్యాగులో ఎప్పుడూ డ్రైఫ్రూట్స్ బాక్స్‌ తీసుకెళ్లడం ఉత్తమం. దీంతో ఎప్పుడైనా ఆకలేస్తే తినేయవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.