గుంటూరు జిల్లా తెనాలిలో మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశారు. కానిస్టేబుల్‌పైనే దాడికి దిగాడు. తెనాలి పట్టణం సుల్తానాబాద్‌లోని ఓ హోటల్‌కు వెంకటేష్ నాయక్ అనే యువకుడు మద్యం తాగి వచ్చాడు. హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ పోలేశ్వరరావు అక్కడకు చేరుకుని యువకుడికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వినిపించుకోని వెంకటేష్ నాయక్.. కానిస్టేబుల్‌పైనే దాడికి దిగాడు. దీంతో ఆయన పక్కకు వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఓ కర్ర తీసుకుని కానిస్టేబుల్ వాహనంపై దాడిచేశాడు. మద్యం మత్తు దిగాక వెంకటేష్ నాయక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: లఘుచిత్రంతో.. కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన