Drunk and Drive: తెలంగాణలోని హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన తనిఖీలు రసాభాసగా మారాయి. బంజారాహిల్స్లో పార్క్ హయత్ హోటల్ ఎదురుగా నిర్వహించిన తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు దొరికారు. అయితే.. కొంతమందిని వదిలేసి, తమను మాత్రమే పట్టుకున్నారని కొందరు మందుబాబులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడపటంతో పోలీసులు సీజ్ చేయగా.. తమ వాహనాలు తిరిగి ఇవ్వాలని గొడవ పడ్డారు.
రోడ్డుకు అడ్డంగా పడుకొని, రోడ్డుపై వచ్చే ఇతర వాహనాలను ఆపుతూ వీరంగం సృష్టించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కాగా.. అందుకో ఒకరు.. "నేను మేడ్చల్ ఎమ్మెల్యేను.. నన్నే ఆపుతారా?" అంటూ ఒక వ్యక్తి దౌర్జన్యానికి దిగాడు. అతనితోపాటు మరో ఐదుగురు మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: Sarpanch Dance Video Viral: ఆదర్శంగా ఉండాల్సినవాడు.. అశ్లీల నృత్యాలు చేస్తూ