ETV Bharat / city

Vaccine: కరోనా టీకా కోసం వెళ్తే.. రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారని నర్సు ఆందోళన - doctors gave rabbis vaccine instead of corona

కరోనా టీకా కోసం వెళ్తే.. ఓచోట మొదటి డోసు కొవాగ్జిన్ మరో డోసు కొవిషీల్డ్ వేశారు. మరోచోట ఒకేసారి రెండు డోసులు ఇచ్చారు. ఇంకోచోట ఏకంగా ఎంపీకే నకిలీ టీకా అందించారు. తాజాగా.. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో అయితే.. కొవిడ్ టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు.. కుక్క కాటుకు ఇచ్చే వ్యాక్సిన్ వేశారన్న వార్త సంచలనమైంది.

Vaccine
Vaccine
author img

By

Published : Jul 1, 2021, 8:03 AM IST

కరోనా టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటు వ్యాక్సిన్‌ ఇచ్చారన్న వార్త.. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్ట ప్రమీల పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకుని ఆమె మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లారు.

పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా.. పక్కనే ఉన్న ఆయుష్‌ భవనంలో కొవిడ్‌ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పీహెచ్‌సీకి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళకు నర్సు యాంటి రేబిస్‌ వ్యాక్సిన్‌ను వేసిందని.. కొవిడ్‌ టీకా ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకూ అదే సిరంజీతో యాంటి రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిందని ఆమె ఆరోపించారు.

ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా ‘బాధితురాలు కరోనా టీకా బ్లాక్‌లోకి కాకుండా, యాంటిరేబిస్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్న గదిలోకి వెళ్లారు. ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయలేదు. టీటీ ఇంజక్షన్‌ ఇచ్చాం. దాంతో ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని తెలిపారు.

ఇదీ చదవండి:

CM JAGAN: తెలంగాణలో మన ప్రజలున్నారు.. సామరస్యంగా పరిష్కరించుకుందాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.