ETV Bharat / city

CYBER CRIME: "అవధులులేని ఆనందం.. అటువైపు చూస్తే ఖతం!" - why do people cyberbully

Cyber Crime Latest: చల్లని సాయంత్రం.. వేడివేడి పకోడీలు.. పండు వెన్నెల.. పూల మొక్కల నుంచి సుగంధపు వాసనలు.. గాలిలో తేలిపోయే మనసు.. అవధుల్లేని ఆనందం.. ఇలా అన్నీ అందమే కదా.. ఇవన్నీ ప్రేమ పావురాల తేనెల మాటలనుకునేరు.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇవీ.. సైబర్​ నేరగాళ్ల కొత్త తరహా వలపు మాటల తూటాలు! ఆశపడ్డారో... అంతే సంగతులు..!

CYBER CRIME
కొత్త తరహా సైబర్​ క్రైమ్​
author img

By

Published : Apr 30, 2022, 10:46 AM IST

Cyber Crime Latest: అందమైన సాయంత్రాలు.. అవధులులేని ఆనందం ఆస్వాదించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మాతో మాట్లాడండి.. అంటూ మీ చరవాణులకు, వాట్సాప్‌కు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయా? నిజమేనననుకుని మాట్లాడితే మీ బ్యాంక్‌ ఖాతాల్లోంచి రూ.లక్షలు మాయమవడం ఖాయం. కోల్‌కతా కేంద్రంగా సైబర్‌ నేరస్థులు యువకులపై ప్రయోగించిన సమ్మోహనాస్త్రాలివి. చరవాణులకు వచ్చిన ఫోన్‌నంబర్లతో మాట్లాడిన కొందరు రూ.లక్షలు నగదు బదిలీ చేసి మోసమని తెలుసుకుని సైబర్‌ క్రైమ్‌పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

రూ.10 వేలు కడితే సభ్వత్యం: చరవాణులకు సంక్షిప్త సందేశాలు, వాట్సాప్‌ నంబర్‌కు చిత్రాలు పంపుతున్న సైబర్‌ నేరస్థులు బాధితులను మోసం చేసేందుకు భారీ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్నారు. రోజుకు వెయ్యిమందికి సందేశాలు పంపుతున్నారు. స్పందించిన వారితో ఫోన్‌లో మాట్లాడేందుకు అందమైన యువతులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. ఫోన్‌ చేసిన వారితో మత్తుగా మాట్లాడ్డం.. ఫలానా చోట ఉన్నాం.. భోజనం చేద్దామంటూ చెప్పించడం.. బాధితులు అంగీకరించగానే రూ.10వేలు సభ్యత్వరుసుం చెల్లించాలని షరతు విధిస్తున్నారు. చెల్లించగానే.. వీడియోకాల్‌ చేసి మాట్లాడుతున్నారు. రిసార్ట్‌కు వెళ్దాం.. నాకు నగదు బదిలీ చేస్తే.. తెలిసిన ప్రాంతానికి వెళ్దాం అంటున్నారు. నగదు బదిలీ చేయగానే.. మాట్లాడ్డం ఆపేస్తున్నారు..

పోలీసులు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌.. వలపు వలలో చిక్కుకున్న ఓ యువకుడు యువతి సూచనలకు అనుగుణంగా రూ.1.10లక్షలు నగదు బదిలీ చేశాడు. రమ్మన్న ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆమె లేదు. మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు అతడి ఎదురుగానే మూడు ఫోన్లతో మాట్లాడారు. ఆమె పేరుతో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయగా.. సికింద్రాబాద్‌లో ఉన్నానని చెప్పింది. వెంటనే వచ్చి సభ్యత్వ రుసుం కట్టేస్తానంటూ పోలీసుఅధికారి చెప్పిన వెంటనే ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసింది. మరో పేరున్న యువతికి ఫోన్‌ చేసినా ఆమె కూడా స్విచ్ఛాఫ్‌ చేసింది. ఆ సిమ్‌కార్డులు కోల్‌కతాలోనివని తేలింది.

డేటింగ్‌.. మీటింగ్‌తో మాయోపాయాలు: 'డేటింగ్‌-మీటింగ్‌ పేరుతో చరవాణులు, వాట్సాప్‌ నంబర్లకు సంక్షిప్త సందేశాలు, ఫొటోలు వస్తున్నాయి. కోల్‌కతా సైబర్‌ నేరస్థుల పనేనని ఆధారాలు లభించాయి. పది కాల్‌సెంటర్లు ఏర్పాటుచేశారని తెలుసుకున్నాం. అక్కడికి వెళ్లి నిందితులను అరెస్ట్‌ చేయనున్నాం. యువతుల పేర్లు.. ఫోన్‌నంబర్లతో వచ్చిన సందేశాలను, చిత్రాలపై సైబర్‌ క్రైమ్‌ ఠాణాల్లో సమాచారం ఇవ్వండి. మోసపోబోయే వందలమందిని రక్షించినవారవుతారు.' - కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌ క్రైమ్స్‌ హైదరాబాద్‌

ఇదీ చదవండి: Woman dead body: గుర్తుతెలియని మహిళను తగలబెట్టి రోడ్డుపై పడేశారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.