తెలంగాణలో కరోనాతో మృతి చెందిన నారాయణపేట జిల్లాకు చెందిన చిన్నారికి వైద్యం చేసిన ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. చిన్నారిని ఈనెల 15న మహబూబ్‌నగర్‌లోని శ్రీకర చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. పాపను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
ఈనెల 18న చిన్నారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడం వల్ల ఆసుపత్రి వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రిని మూసివేసి వైద్యులను, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఘటనపై విచారణ జరిపిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు.