ETV Bharat / city

రూపాయికే క్వార్టర్​ మద్యం... మందుబాబుల్లో ఆనందం - శంకర్​ పెళ్లి రోజున మందు పంచి అభిమాని

హీరోలు, నాయకుల పుట్టిన రోజులకు అభిమానులు... అన్నదానాలు, రక్తదానాలు, ఆస్పత్రుల్లో పాలు, పండ్లు పంచడం చాలా సాధారణమైన విషయం. తన అభిమాన వ్యక్తి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడో... వార్తల్లో నిలవాలనుకున్నాడో... ఈ వీరాభిమాని మాత్రం తనకు ఇష్టమైన వ్యక్తి పెళ్లిరోజున... అన్నింటికీ భిన్నంగా... మరీ వినూత్నంగా... మద్యం పంచాడు. ఫ్రీగా కాందండోయ్​... క్వార్టర్ మందుకు రూపాయి తీసుకున్నాడు​. ఈ వేడుక ఎక్కడో జరిగిందో చూసేయండి

director-shankar-fan-distributed
రూ.1కే మందుబాబులకు బహుమానం
author img

By

Published : Nov 15, 2020, 10:05 PM IST

Updated : Nov 15, 2020, 10:24 PM IST

రూ.1కే మందుబాబులకు బహుమానం

నవంబర్​ 16న సినిమా డైరెక్టర్ ఎన్.శంకర్ పెళ్లి రోజు. ఈ వేడుకను పురస్కరించుకుని శంకర్​ అభిమాని అయిన తెరాస పార్టీకి చెందిన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు... వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్​లో ఒక్క రూపాయికి క్వార్టర్ చొప్పున మద్యం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఒక గంట పాటు మాత్రమే కొనసాగించారు.

విషయం తెలుసుకున్న మందుబాబులు పెద్దసంఖ్యలో వైన్స్​ వద్దకు చేరుకున్నారు. పంపిణీకి గంట సమయం మాత్రమే కేటాయించటం వల్ల కొంత మందిని మాత్రమే ఆ అదృష్టం వరించింది. పరిమిత కాలంలో టోకెన్లు దక్కించుకున్న 45 మంది ఒక్క రూపాయి చెల్లించి మద్యాన్ని అందుకోగలిగారు. భౌతికదూరం పాటింపజేస్తూ... పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వార్టర్ తీసుకున్న లబ్ధిదారులు అమితానందం వ్యక్తం చేశారు. టోకెన్లు అందుకోలేకపోయిన చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సైతం విష్ణు నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శంకర్​తో పరిచయం ఉందని విష్ణు తెలిపారు. ఆయన​పై అభిమానంతోనే పెళ్లిరోజు సందర్భంగా ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించానని వివరించారు.

ఇదీ చదవండి:

ఆట మధ్యలో వివాదం... రోడ్డుపై రణరంగం

Last Updated : Nov 15, 2020, 10:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.