మార్చి 10న ఈనాడులో ప్రచురించిన ‘డయాఫ్రం వాల్ వరదార్పణం’ వార్తకు పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీరు కె.నరసింహమూర్తి వివరణ ఇచ్చారు. పోలవరంలో రూ. 422.20 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను బావర్, ఎల్‌అండ్‌టీ కంపెనీలు ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుని పూర్తి చేశాయని పేర్కొన్నారు. 2019 వరద నీటిని స్పిల్ వే, స్పిల్ ఛానల్ మీదుగా గోదావరి దిగువకు మళ్లించామని పేర్కొన్నారు. కాఫర్ డ్యాంలలో కొంత మేర వదిలేసిన ఖాళీ ప్రాంతాల మీదుగా వరద నీటిని మళ్లించడం వల్ల డయాఫ్రం వాల్‌లో కొంత భాగం 2019 వరదలకు కోసుకుపోయిందని తెలిపారు.
2019 డిసెంబరు 31న నిపుణుల కమిటీ ఈ విషయం గుర్తించి డయాఫ్రం వాల్‌కు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించిందన్నారు. 2020 గోదావరి వరదల కారణంగా రెండో అతి పెద్ద గరిష్ఠ నీటిమట్టం నమోదైందన్నారు. వరద ఉద్ధృతికి డయాఫ్రం వాల్ కుడివైపున 157 మీటర్ల మేర కోతకు గురైందని వివరించారు. వరద తగ్గిన తర్వాత ఇది బయటకు కనిపించిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ దీనిపై కొన్ని సూచనలు చేసిందని అన్నారు. వారి సూచనల ప్రకారమే డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాన్ని పునరుద్ధరిస్తామని ఎస్‌ఈ వివరించారు.
ఇదీ చదవండి: