ETV Bharat / city

ధరలు ప్రియం... ధనత్రయోదశి అమ్మకాలు అంతంతే..!

ధన త్రయోదశికి చిన్నమెత్తు బంగారం కొనాలనేది భారతీయుల సెంటిమెంట్. ప్రతి ఏటా ఎంతో కొంత బంగారం కొందామని ఆసక్తి కనబరిచే ప్రజలు ఈసారి కరోనా మహమ్మారి కారణంగా వెనుకంజ వేయటంతో ఆభరణాల దుకాణాలు వెలవెలబోతున్నాయి. కరోనా కష్టాలకు తోడు బంగారం వెండి ధరలు పెరగటంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగాయి. గత ధన త్రయోదశితో పోల్చితే ఈసారి అమ్మకాల్లో 30 శాతం వరకూ తగ్గుదల నమోదైందని వ్యాపారులు అంటున్నారు.

author img

By

Published : Nov 13, 2020, 6:41 PM IST

gold sales
gold sales

ధనత్రయోదశి లేదా ధంతేరాస్.. దీపావళికి రెండు రోజుల ముంద వచ్చే ఈ పండగకు ఎంతో విశిష్టత ఉంది. ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకునే ఈ పండగకు ఇటీవల కాలంలో దక్షిణాదిలోనూ మక్కువ పెరిగింది. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే అదృష్టం, సంపద వస్తుందని నమ్మకంతో చాలా మంది ఓ సెంటిమెంట్​గా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయడంతో అమ్మవారు ఇంటికి వస్తారని నమ్ముతారు. అందువల్ల ధంతేరాస్ రోజున చాలా మంది మహిళలు బంగారమో, వెండి వస్తువులనో కొనుగోలు చేస్తారు. వాటికి పసుపు, కుంకుమ రాసి.. అమ్మవారి పాదల చెంత ఉంచి పూలతో పూజ చేస్తారు. దీపావళి వేడుకలలో భాగంగా ఈ పండగను జరుపుకోవడం అనాదిగా వస్తున్నదే.

ఈసారి మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో పండుగ వాతావరణం లేదు. కొనుగోలు తగ్గడానికి ప్రధాన కారణం బంగారం, వెండి ధరలు పెరగడమే అనే వాదన వ్యాపారుల నుంచి వస్తోంది. ధరలు పెరగడంతో డిమాండ్‌ తగ్గందని అంటున్నా... కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక కష్టాలతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనేది మరో అంచనా. దేశంలో 10 గ్రాముల 53 వేల రూపాయల వరకూ ఉంది. గత ఏడాది ధన త్రయోదశితో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ. కిలో వెండి ధర 62 వేల రూపాయలకు చేరింది. ఈ ధరలు ఎంతకాలం నిలబడతాయో తెలియడం లేదు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, వ్యాపార పరిస్థితులు బాగుపడతాయని అంచనా వేస్తున్నారు. ఈ కారణంతోనే ఏటా ధన త్రయోదశికి సెంటిమెంట్‌గా బంగారం లేదా వెండి కొనే వ్యక్తులు ఒకటికి రెండు సార్లు అలోచిస్తున్నారు.

లాక్​డౌన్ కష్టాలతో పోల్చితే ఈ ధనత్రయోదశి తమను ఎంతో కొంత పంజుకునేలా చేసిందని అభరణాల వర్తకులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావటంతో గిరాకీ పరిస్థితులు గత 5-6 నెలలతో పోల్చితే మెరుగుపడ్డాయని చెప్తున్నారు. పండగ సీజను ప్రారంభమైనప్పటి నుంచి అమ్మకాలు, విక్రయ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుండటమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే ధనత్రయోదశి అమ్మకాలు జోరు తగ్గినా... గత అయిదారు నెలల పరిస్థితితో పోల్చితే ఫర్వాలేదనిపించింది.

ఇదీ చదవండి

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై భాగస్వాములకు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.