ETV Bharat / city

DH on Corona Third Wave: 'కరోనా మూడో దశ పూర్తిగా తగ్గింది.. ఎలాంటి ఆంక్షల్లేవు' - Telangana news

DH on Corona Third Wave: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయిందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు అమలులోలేవన్నారు. అన్ని సంస్థలు వందశాతం సిబ్బందితో పని చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

DH on Corona Third Wave
DH on Corona Third Wave
author img

By

Published : Feb 8, 2022, 3:42 PM IST

'కరోనా మూడో దశ పూర్తిగా తగ్గింది.. ఎలాంటి ఆంక్షల్లేవు'

DH on Corona Third Wave: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో దశ పూర్తిగా తగ్గిందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. తెలంగాణలో ఎలాంటి కొవిడ్‌ ఆంక్షలు అమలులో లేవన్నారు. జనవరి 28న మూడోదశ ఉద్ధృతి పెరిగిందన్న డీహెచ్​... టీకా తీసుకున్నవారిలో ప్రభావం తక్కువగా ఉందని వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని.. అత్యధిక పాజిటివిటీ రేటు 5 శాతానికి వెళ్లిందని శ్రీనివాసరావు తెలిపారు.

ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోమ్‌ విరమించుకోవచ్చని డీహెచ్​ సూచించారు. అన్ని సంస్థలు వంద శాతం సిబ్బందితో పనిచేయవచ్చని.. పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు రావచ్చని వెల్లడించారు. కేసులు తగ్గినా మాస్కులు ధరించాలని.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5 కోట్ల మందికి పైగా టీకాలు పంపిణీ చేశామని.. 82శాతం మందికి రెండు డోస్‌లు పూర్తయ్యాయని వివరించారు.

రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2శాతం కంటే తక్కువ. అత్యధిక పాజిటివిటీ రేటు 5 శాతానికి వెళ్లింది. రాష్ట్రంలో కరోనా మూడో దశ పూర్తిగా తగ్గింది. ఎలాంటి కొవిడ్‌ ఆంక్షలు అమలులో లేవు. కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోమ్‌ విరమించుకోవచ్చు. అన్ని సంస్థలు వంద శాతం పనిచేయవచ్చు.

-- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

టీనేజర్లకు 73 శాతం మందికి తొలిడోస్.. 13 శాతం మందికి రెండు డోసులు ఇచ్చామని తెలిపారు. నిజామాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాలు మినహా రాష్ట్రమంతా వంద శాతం తొలి డోసు పూర్తైందని శ్రీనివాసరావు వివరించారు. మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. 150 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు. జాతరలో ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 150 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశాం. అవసరమైన పరీక్షలు అక్కడే చేసేలా ఏర్పాట్లు. ఇప్పటి వరకు 5 కోట్ల మందికి పైగా టీకాలు వేశాం. 82శాతం మందికి రెండు డోస్‌ల టీకా పూర్తయింది.

-- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

ఇదీ చూడండి: TS Corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా 1,380 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.