ETV Bharat / city

కోర్టు ఉత్తర్వుల అమల్లో నిర్లక్ష్యంపై హైకోర్టు అసహనం

రాష్ట్రంలో ఎక్కువ మంది అధికారులు.... తాము చట్టం కన్నా ఎక్కువ అనే భావనలో ఉన్నారని.... ఇలాంటి పరిస్థితి ఇక్కడే చూస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరైనా అలా భావించొద్దని హితవు పలికింది. కోర్టు ఆదేశాల అమలుపై పలుసార్లు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఓ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

DGP attending the hearing in the High Court
కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టుకు డీజీపీ
author img

By

Published : Jan 28, 2021, 3:54 AM IST

Updated : Jan 28, 2021, 7:40 AM IST

కోర్టు ఉత్తర్వుల అమల్లో నిర్లక్ష్యంపై హైకోర్టు అసహనం

ఓ ఎస్సై పదోన్నతి విషయమై దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్య విచారణకు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ హైకోర్టుకు హాజరయ్యారు. గతంలో కోర్టుకు డీజీపీ హాజరైనప్పుడు.... సిన్సియర్‌ అనే భావనను వ్యక్తపరిచామన్న హైకోర్టు..... ఇప్పుడు బలవంతంగా దాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. మీ కార్యాలయంలో కిందిస్థాయి అధికారులు ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదని..... అక్కడి పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వుల అమల్లో కిందిస్థాయి ఉద్యోగులు చూపుతున్న నిర్లక్ష్యం వల్ల......డీజీపీని మళ్లీ మళ్లీ కోర్టుకు పిలవాల్సి వస్తోందని పేర్కొంది. ఓ అధికారికి పదోన్నతి కల్పించినప్పటికీ.... తమ ఆదేశాల అమల్లో ఉద్దేశపూర్వక ఉల్లంఘన, నిర్లక్ష్యం, జాప్యం కనిపిస్తోందని ప్రాథమికంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కారణాలను వివరిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

నేపథ్యమిదే..

ఎస్సై రామారావుకు సీఐగా పదోన్నతి కల్పించే ప్యానల్లో స్థానం కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. వాటిని అమలు చేయకపోవడంతో రామారావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు..... హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఇతరుల హాజరుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరవగా..... తమ నోటీసును ఎప్పుడు అందుకున్నారని డీజీపీని ధర్మాసనం ప్రశ్నించింది. మీ అధికారులతో చర్చించడానికి ఇది మీ కార్యాలయం కాదని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అన్ని వివరాలతో కోర్టు ముందుకు రావాలని పేర్కొంది.

వారి నుంచి సలహా తీసుకోవడమేంటి?

కోర్టు ఉత్తర్వుల అమల్లో.... జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి న్యాయసలహా తీసుకోవడంలో జాప్యం జరిగిందని డీజీపీతో పాటు హాజరైన ఇతర అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం...... ఈ వ్యవహారశైలి దారుణమని పేర్కొంది. కోర్టు ఉత్తర్వుల అమల్లో అడ్వొకేట్ జనరల్ లేదా ప్రభుత్వ న్యాయవాదుల నుంచి సలహా తీసుకోవాలే తప్ప..... జాయింట్ డైరెక్టర్ ఆఫ్‌ ప్రాసిక్యూషన్ సలహా తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం వల్ల పిటిషనర్ ఎంత బాధకు గురై ఉంటారో ఊహించారా అని ప్రశ్నించింది. అర్హత ఉండి పదోన్నతి రాకపోయుంటే ఆ బాధ మీకు తెలిసేదని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాల్ని సరైన స్ఫూర్తితో అమలు చేయాలన్నారు. విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తూ.... తదుపరి విచారణకు డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శికి మినహాయింపు ఇచ్చింది.

ఇదీ చదవండి:

ఎన్నికల ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి: ఎస్ఈసీ

Last Updated : Jan 28, 2021, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.