తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ దేవినేని ఉప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని ఉమపై మే 7 వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఆదేశాలు ఉన్నాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జూన్ 17 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గుంటూరు సీఐడీ డీఎస్పీ విచారణాధికారిగా ఉండాలంటే కొనసాగవచ్చుని హైకోర్టు తెలిపింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: వరుసగా రెండో రోజూ 4 లక్షలకుపైగా కేసులు