విశాఖలో రాజధాని పేరుతో వైకాపా నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని తెదేపా నేత దేవినేని ఉమా ఆరోపించారు. విశాఖలోని దస్పల్లా, వాల్తేరు క్లబ్ భూములు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సీఎం జగన్ విశాఖలో కార్యనిర్వాహక రాజధాని అని చెప్పిన రోజు నుంచే...రియల్ దందా మొదలైందని అన్నారు. వేలాది ఎకరాల భూముల కోనుగోళ్లు జరిగాయని...వీటిపై సీఎం జగన్... ఎందుకు సీబీఐ విచారణ జరిపించడంలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి.. విశాఖలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలోనూ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్ని కుట్రలు చేసిన ప్రజా రాజధాని అమరావతిని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : 'సముద్రతీరానికి దూరంగా రాజధాని ఉండాలని సిఫార్సు చేశాం'