సెంటు పట్టా పేరుతో వైకాపా ప్రభుత్వం వందలకోట్లు దోపిడీకి పాల్పడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఇళ్లకు విద్యుత్ కనెక్షన్, కనీస సౌకర్యాలు కల్పించి తెదేపా హయాంలో కట్టిన లక్షలాది ఇళ్లను లబ్దిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పశువులమేత భూముల్లో, చెరువులు, కుంటల్లో ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ తన ప్రజా ప్రతినిధుల జేబులు నింపేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి :