ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పారాదీప్‌కు 1060 కిలోమీటర్లు, బంగాల్లోని దిఘాకు 1220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యింది. మరో 12 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో అది తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాయుగుండం క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగాల్, ఒడిశా తీరాలవైపు వెళ్లే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఈ నెల 18 నుంచి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలోని తీరప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతుందన్నారు. తూర్పు తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
ఒడిశా, బంగాల్ తీర ప్రాంతాల్లో ప్రస్తుతం గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నట్లు వివరించారు. రేపటి నుంచి ఈ ఈదురు గాలులు మరింతగా పెరిగే అవకాశం ఉందనీ, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదీ చదవండి: ఆర్టీసీలో 6 వేలమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఔట్