ETV Bharat / city

ప్రబలుతున్న డెంగీ జ్వరాలు.. అల్లూరి జిల్లాలో 8 మంది మృతి

Dengue fevers: రాష్ట్రంలో డెంగీ జ్వరాలు వణుకు పుట్టిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో దోమల వ్యాప్తి చెంది జ్వరాలు ప్రబలుతున్నాయి. పలు జిల్లాల్లో విషజ్వరాలూ విజృంభిస్తున్నాయి. రికార్డులకెక్కని ప్రైవేటు కేసులు చాలానే ఉన్నాయి. ఒక్క అల్లూరి జిల్లాలోనే డెంగీ జ్వరాలతో 8 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Dengue fevers
డెంగీ జ్వరాలు
author img

By

Published : Sep 3, 2022, 9:49 AM IST

Dengue fevers: రాష్ట్రంలో విషజ్వరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది జ్వరాలతో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా డెంగీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు వరకు ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం 6,343 మంది డెంగీకి చికిత్స పొందారని తెలుస్తుండగా, వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు మాత్రం 2,174 కేసులే నమోదైనట్లు చెబుతున్నాయి. రికార్డుల్లోకి ఎక్కనివి మరెన్నో! ఎడతెరిపిలేని వర్షాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. దోమల వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. నియంత్రణ విషయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండడంలేదు. కొన్నిచోట్ల పగిలిన పైపుల ద్వారా మంచినీరు కలుషితమై అతిసార వ్యాధి ప్రబలుతోంది. తెనాలి, విజయవాడ శివారు గన్నవరం మండలంలో డయేరియా వంటి కారణాల వల్ల అధికారిక లెక్కల ప్రకారం నలుగురు మరణించారు. ‘మురికి కాల్వల్లో ఎప్పటికప్పుడు పూడిక తీసి మురుగు వేగంగా కదిలేలా చేయాలి. వాన నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమల నిర్మూలనకు ఆయిల్‌ బాల్స్‌ వాడాలి. ఇళ్లల్లో నీరు వారం కంటే ఎక్కువగా నిల్వ ఉండకుండా చూడాలి’ అని వైద్యులు సూచిస్తున్నారు.

విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరు, మన్యం గిరిజన ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. గోదావరి ముంపు ప్రాంతాలు జ్వరాలతో వణికిపోతున్నాయి. బాధితులకు విపరీతమైన జ్వరం, చలి, ఒంటినొప్పులు, తలనొప్పి, జలుబు లక్షణాలు ఉంటున్నాయి. కొందరిలో దగ్గు కూడా ఉంటోంది. టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ పాజిటివ్‌ కేసులతోపాటు సాధారణ వైరల్‌ జ్వరాలు, డెంగీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. డెంగీ కేసులు రికార్డుల్లోకి ఎక్కడంలేదు. ప్రభుత్వ వైద్య కేంద్రంలో ఎలీసా పరీక్ష చేస్తే తప్ప డెంగీ అని నిర్ధారించకూడదంటూ వైద్యారోగ్యశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు వీటి గురించి బయటకు చెప్పడం లేదు. విష జ్వరాల పేరిట చికిత్స అందిస్తున్నారు.

అల్లూరి జిల్లాలో 8 మంది మృతి
* అల్లూరి జిల్లాను జ్వరాలు పీడిస్తున్నాయి. చింతూరు, కూనవరం తదితర ముంపు మండలాల్లో ఇటీవల ఎనిమిదిమంది చనిపోయారు. చింతూరు మండలం కొయగూరులోనే అయిదుగురు చనిపోయారు. మరో 25 మంది చికిత్స పొందుతున్నారు. కూనవరం మండలం సినార్పూరు, టేకుబారులో ఇంటింటా జ్వరాలతో మంచానపడినవారు ఉన్నారు.

* పాడేరు డివిజన్‌ మొత్తంగా 32 డెంగీ కేసులు ఇప్పటి వరకు నమోదైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

* విజయనగరం జిల్లాలో గత ఏడాది 271 డెంగీ కేసులు నమోదైతే ఈ ఏడాది కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తవలస, ఎల్‌.కోట, భోగాపురం మండలాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది.

మన్యం జిల్లాలో 137 కేసులు: పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,340 మంది నుంచి నమూనాలు తీసి పరీక్షిస్తే 137 కేసులు బయటపడ్డాయి. పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ ఏడాది 67 కేసుల వరకూ నమోదయ్యాయి. మలేరియాతో 357 మంది బాధపడ్డారు.

వృద్ధ దంపతులు ఆసుపత్రి పాలు: అనకాపల్లి జిల్లాలోని పలు పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల రావికమతం మండలం కవ్వగుంట గ్రామానికి వెళ్లినప్పుడు స్థానికులు రోడ్డుపై నిలిచిపోయిన మురుగునీటిపై ఫిర్యాదుచేశారు. ఆ గ్రామంలో తాజాగా వృద్ధ దంపతులు డెంగీ బారిన పడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిని చూడడం కోసమని రావికమతం నుంచి ఆసుపత్రికి వెళ్లిన వారి మనవడికీ డెంగీ జ్వరమొచ్చింది.

తొమ్మిదేళ్ల బాలుడి మృతి
* విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో విష జ్వరాల బాధితులు పెద్దసంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఆగస్టులోనే 20 డెంగీ కేసులు వచ్చాయి. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పంచాయతీలోని కొత్తపేట ప్రాంతంలో పది రోజుల కిందట జ్వరం బారినపడి తొమ్మిదేళ్ల బాలుడు మరణించాడు.

* విశాఖ నగర పరిధిలో ఆసుపత్రుల్లో చేరే వారిలో 90% మంది డెంగీ, వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న వారే ఉన్నారు.

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కిట్ల కొరత
* కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీల పరిధిలో డెంగీ, మలేరియా నిర్ధారణ కిట్ల కొరత వేధిస్తోంది.

* తిరుపతి జిల్లాలో నెల రోజుల నుంచి జ్వరపీడితులతో ఆసుపత్రుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. దోమలు వ్యాప్తి చెందకుండా కాలువల్లో మందులు పిచికారీ చేయడం లేదు.

* నెల్లూరు నగరంలో సర్వేపల్లి కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో.. ఎక్కడికక్కడ మట్టి కుప్పలతో కాలువల్లో మురుగునీటి ప్రవాహం ఆగిపోయింది. ఇది దోమల వృద్ధికి కారణమవుతోంది.

అన్నమయ్య జిల్లాలో..
* అన్నమయ్య జిల్లా మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, బి.కొత్తకోట, పీటీఎం మండలాల్లో ఇప్పటి వరకు 62 కేసులు నమోదయ్యాయి. రెండు మరణాలను అధికారిక జాబితాలో చేర్చారు. ఓబులవారిపల్లె మండలం లింగిరెడ్డిపల్లెలో డెంగీతో వైద్య విద్యార్థి(18) గురువారం చెన్నై అపోలో ఆసుపత్రిలో మరణించారు. పెద్దమండ్యం మండలంలో టైఫాయిడ్‌ జ్వరాలతో వందలాది మంది బాధపడుతున్నారు.

* పెనగలూరు నారాయణ నెల్లూరు గ్రామంలో యువకుడు(24) డెంగీ అనుమానిత లక్షణాలతో పక్షం రోజుల కింద మరణించారు.

* లక్కిరెడ్డిపల్లెలో హనుమాన్‌ గుండు బజారు వీధికి చెందిన 6 నెలల బాలుడు వారం రోజుల కింద డెంగీతో బెంగళూరు ఆసుపత్రిలో మరణించారు. మరో బాలుడు తిరుపతిలో చికిత్స పొందుతున్నారు.

వైయస్‌ఆర్‌ జిల్లాలో..
* వైయస్‌ఆర్‌ జిల్లా చాపాడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన మహిళ ఒకరు డెంగీ లక్షణాలతో కడప రిమ్స్‌లో చేరారు.

* ప్రొద్దుటూరులో ఇటీవల నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. కడప రిమ్స్‌లో కేసులు, మరణాలు నమోదవుతున్నా.. లెక్కల్లో చూపించడంలేదు.

* చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం 100 మంది వరకు జ్వర పీడితులు వస్తున్నారు. ఓపీల కోసం పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య చర్యలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. మురుగు కాల్వలను శుభ్రం చేయడం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా 2,174 డెంగీ కేసులు
* ఈ ఏడాది ఆగస్టు 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా డెంగీ కేసులు 2,174 నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. కిందటేడాది ఇదే సమయానికి 1,388 కేసులు రికార్డయ్యాయి. విశాఖ జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 286, విజయనగరం జిల్లాలో 237, అనకాపల్లి జిల్లాలో 109, పార్వతీపురం మన్యం జిల్లాలో 103 చొప్పున కేసులు వచ్చాయి.

* ఇప్పటి వరకు మలేరియా కేసులు 1,237 వచ్చాయి. కిందటేడాది ఇదే సమయానికి 1,069 రాగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 618 కేసులు రాగా, పార్వతీపురం మన్యం జిల్లాలో 349 కేసులు నమోదయ్యాయి.

ఏలూరులో ఒక్కరోజే 11 కేసులు: ఏలూరు జిల్లాలో ఈ నెల 1న ఒక్కరోజే 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు చికిత్స పొందుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక దోమలు పెరిగి జ్వరాలు వ్యాపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.