ETV Bharat / city

BDL Products Exhibition: బాంబుల నుంచి క్షిపణుల వరకు.. ఆకట్టుకుంటున్న ప్రదర్శన - hyderabad news

BDL Products Exhibition: దేశంలో ప్రతిష్ఠాత్మక సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) రక్షణ రంగ ఉత్తత్తుల ప్రదర్శన నిర్వహిస్తోంది. ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని సంస్థ కార్యాలయం ఇందుకు వేదికగా మారింది. ఈ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. యుద్దంలో వినియోగించే అత్యాధునిక క్షిపణులు, ఇతర రక్షణ ఉత్పత్తులు, నమూనాలు ప్రదర్శనలో కొలువుదీరాయి.

BDL Products Exhibition: బాంబుల నుంచి క్షిపణుల వరకు.. ఆకట్టుకుంటున్న ప్రదర్శన

author img

By

Published : Dec 15, 2021, 2:23 PM IST

BDL Products Exhibition: యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణులు.. గగనతల లక్ష్యాలను చేధించే ఆస్త్రాలు.. సముద్రంలో షిప్‌పై నుంచి ప్రయోగించే టొర్పొడోలు.. నీటి అడుగున వాడే ఆయుధాలు.. సైనికుల రక్షణ కవచం బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల వరకు.. ఇవన్నీ హైదరాబాద్‌లోని రక్షణ రంగ సంస్థలు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌), మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని)లో తయారవుతున్నాయి. వీటిలో కొన్నింటిని డీఆర్‌డీవో డిజైన్‌ చేయగా.. మరికొన్నింటిని ఆయా సంస్థలే స్వయంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్నాయి. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా కంచన్‌బాగ్‌లోని బీడీఎల్‌, మిధానీలో తమ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మంగళవారం మీడియాకు ప్రదర్శించారు. స్థానికంగా చదువుకుంటున్న విద్యార్థులతో పాటు నూజివీడు నుంచి ట్రిపుల్‌ ఐటీ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రదర్శనను తిలకించేందుకు హైదరాబాద్‌ వచ్చారు. ఈ నెల 19 వరకు ఉదయం10 నుంచి సాయంత్రం 5 వరకు విద్యార్థులు, ప్రజలు సందర్శించవచ్చు.

బీడీఎల్‌లో..

ఆకాశ్‌

ఆకాశ్‌: ఉపరితలం నుంచి గగనతలంలోని విమానాలను ధ్వంసం చేసే క్షిపణి. 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కూల్చేయగలదు. ఒకేసారి నాలుగింటిని ప్రయోగించవచ్చు.

వరుణాస్త్ర

వరుణాస్త్ర: జలాంతర్గాములను కూల్చే ఆస్త్రమిది. షిప్‌ నుంచి ప్రయోగిస్తారు. 70 కి.మీ. దూరం లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.

పృథ్వి

పృథ్వి: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే క్షిపణి. 100 నుంచి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలపై గురిపెట్టగలదు.

గరుడాస్త్ర

గరుడాస్త్ర: జలాంతర్గాములను ధ్వంసం చేసే టొర్పొడోస్‌ ఇది. తాల్‌, వరుణాస్త్ర కూడా ఈ కోవకు చెందినవి.

వీఎల్‌ఎంఆర్‌శామ్‌

వీఎల్‌ఎంఆర్‌శామ్‌: వర్టికల్‌ లాంచింగ్‌ షార్ట్‌ రేంజ్‌ సర్ఫెస్‌ టూ ఎయిర్‌ మిసైల్‌. షిప్‌ మీద నుంచి నిటారుగా ప్రయోగించే అస్త్రం. డిజైన్‌ దశలో ఉంది.

ప్రదర్శనలో రక్షణ ఉత్పత్తులు

దీశానీ: ఇదొక రకమైన బాంబు. సముద్రం లోపల లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. హెలికాప్టర్‌. విమానం నుంచి ప్రయోగిస్తారు.
సీఎండీఎస్‌: మన క్షిపణులకు ముప్పు లేకుండా శత్రు క్షిపణుల నుంచి దారి మళ్లించే వ్యవస్థ ఇది. దీన్ని బీడీఎల్‌ డిజైన్‌ చేసి ఉత్పత్తి చేస్తోంది.
యుద్ధట్యాంకులు: నాగ్‌, కాంకుర్స్‌, మిలాన్‌, ఇన్వార్‌.. ఇవన్నీ శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణులు. రెండు, మూడోతరం అస్త్రాలివి. 2 నుంచి 5 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.

మిధానీలో..

పీఎస్‌ఎల్వీ నమూనాలు

క్షణ రంగానికి అవసరమైన క్షిపణులు, యుద్ధ విమానాల తయారీకి కావాల్సిన ధాతువులు, మిశ్ర ధాతువులను ఉత్పత్తి చేసే మిధానీ.. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలతో అధునాతన మెటీరియల్స్‌తో ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది. రక్షణ అవసరాలతో పాటు రైల్వే, పౌర అవసరాలకు ఉపయోగపడే పరికరాలు ఇందులో ఉంటున్నాయి.

కృత్రిమ అవయవాలు: గుండె స్టంట్స్‌, మోకాలు చిప్పలు, కాలు విరిగినప్పుడు వేసే రాడ్‌ల వరకు టైటానియంతో రూపొందించిన ఇంప్లాంట్స్‌ ఇక్కడ ప్రదర్శించారు.

కార్బన్‌ ఫైబర్‌: విమాన రెక్కలు, క్షిపణులు, సైనిక వాహనాలకు రక్షణ కవచాలను ఇదివరకు అల్యూమినియంతో రూపొందించేవారు. చాలా బరువుగా ఉండేవి. ప్రస్తుతం కార్బన్‌ ఫైబర్‌తో తయారు చేస్తున్నారు. మిధానీ ఈ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేస్తోంది.

మిధానిలో ఉత్పత్తుల వద్ద చిన్నారులు

ఇదే మొదటిసారి..

‘‘బీడీఎల్‌ ప్రాంగణంలో విస్త్రత శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ప్రదర్శనలో ఉన్న ఉత్పత్తులలో ఉపయోగించే అప్లైడ్‌ సైన్స్‌కు సంబంధించి ప్రాథమికాంశాల గురించి విద్యార్థులు తెలుసుకోవడానికి, పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేస్తుంది’’ - కమోడోర్‌ సిద్ధార్థ్‌ మిశ్రా, సీఎండీ, బీడీఎల్‌

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.