జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ చేసిన ఓ ట్వీట్(PAWANKALYAN TWEET)పై తమిళనాడు శాసనసభలో చర్చ జరిగింది. శాసనసభలో ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రసంగిస్తూ.. ఈ ట్వీట్ గురించి ప్రస్తావించారు. ప్రతిపక్షం, అధికారపక్షం అనే తేడా లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందరినీ భాగస్వాములను చేస్తూ... వారికి సముచిత గౌరవం కలిపిస్తూ పరిపాలన చేస్తుండడాన్ని పవన్ తన ట్వీట్‌లో ప్రశంసించారు.
ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయాలు చేయాలే తప్ప... అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదనే మాటలను చేతల్లో చూపిస్తున్నారని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తమిళనాడు శాసనసభలో తమిళంతోపాటు తెలుగులోనూ తెలిపారు.
ఇదీ చూడండి: PAWANKALYAN TWEET: స్టాలిన్‌ను అభినందిస్తూ పవన్‌కల్యాణ్ ట్వీట్