ETV Bharat / city

లైవ్​ వీడియో: భర్తతో మాట్లాడనివ్వట్లేదని అత్తపై కోడలు దాడి - telangana news

కానరాని దేశాల్లో భర్త. అత్త మామల దగ్గర భార్య. ఫోన్లో మాత్రమే కుశల సమాచారాలు. ఆ ఫోను కూడా మాట్లాడనీయట్లేదనే కోపంతో రగిలిపోయిన ఓ కోడలు అత్తపై దాడికి దిగింది. ఆ సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

DAUGHTER-IN-LAW-ATTACK-ON-MOTHER-IN-LAW-IN-MALLEPALLY
భర్తతో మాట్లాడనివ్వట్లేదని అత్తపై కోడలు దాడి
author img

By

Published : Oct 9, 2020, 12:45 PM IST

సౌదీలో ఉన్న తన భర్తతో మాట్లాడనివ్వటం లేదన్న కోపంతో అత్తపై కోడలు దాడి చేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్​ మల్లెపల్లి ఫిరోజ్​ గాంధీనగర్​లో చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం ఉబిద్​ అలీఖాన్​ సౌదీకి వెళ్లాడు.

భార్య అత్తామామల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో సౌదీ నుంచి ఉబిద్​ ఫోన్​ చేస్తే మాట్లాడనివ్వక పోవటం... తన పోషణ గురించి పట్టించుకోవటం వల్ల కోపోద్రిక్తురాలైన కోడలు అత్తపై దాడికి దిగింది. అత్త జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొచ్చి మరీ కొట్టింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ ఘటనపై హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.