గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి సచివాలయ ఉద్యోగాల పరీక్ష రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై, గుర్తింపు పొందిన సంస్థ ద్వారా కంప్యూటర్ ధ్రువపత్రం కలిగి ఉండాలని తెలిపారు. ఈనెల 7 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి : 2018 గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు విడుదల