కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం డి.వనిపెంట పంచాయతీ పరిధిలోని చెంచుగూడెం వెళ్లేందుకు భవనాశి వాగుపై వేసిన తాత్కాలిక వంతెన వరదకు కొట్టుకుపోయింది. దీంతో నడుంలోతు నీళ్లలో తాడును పట్టుకుని ప్రమాదకరంగా వాగును దాటుతున్న గ్రామస్థుడు. ఇలాంటి ఘటనల్లో పలువురు మృత్యువాతపడ్డారు.
ఎడతెరిపి లేన వాన.. వరదై బతుకుల్ని చిన్నాభిన్నం చేసింది. పక్కా ఇళ్లే కాదు పటిష్టమైన మేడలూ వరద ధాటికి కుప్పకూలాయనడానికి నిదర్శనం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలోని ఈ భవనం.
తీవ్రవాయుగుండం.. రైతన్నకు గండంగా మారింది. 3 రోజులపాటు కురిసిన వర్షాలకు చేలన్నీ నడుం లోతు నీటమునిగాయి. విశాఖపట్నం జిల్లా మునగపాకలో నీటిలో నాని కుళ్లిపోతున్న వరిపైరును ఆవేదనతో చూపుతున్న ఓ రైతు.
అసలే అంతంతమాత్రం రోడ్లు.. ఈ వర్షాలకు రాళ్లు తేలి ప్రయాణికులను భయపెడుతున్నాయి. భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలోని బాదంపూడి వై జంక్షన్ వద్ద అధ్వానంగా తయారైన జాతీయ రహదారి ఇది.
ఇదీ చదవండి: