గుంటూరు: దాచేపల్లి మం. నడికుడి వద్ద నల్లవాగులో వ్యక్తి గల్లంతు
ద్విచక్రవాహనంపై వాగు దాటుతుండగా కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు
ఒకరిని కాపాడిన స్థానికులు, మరో వ్యక్తి గల్లంతు
జోరు వర్షం.. స్తంభించిన జనజీవనం
22:38 October 13
నల్లవాగులో వ్యక్తి గల్లంతు
22:38 October 13
అమరావతి-విజయవాడ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
గుంటూరు: అమరావతి మం. పెదమద్దూరు వద్ద కొండవీటి వాగు ఉద్ధృతి

పెదమద్దూరు, చావపాడు, వైకుంఠపురం, మునుగోడులో నీటమునిగిన పంటలు
22:37 October 13
హంద్రీనీవా కాల్వకు గండి
అనంతపురం: ఉరవకొండ మం. లత్తవరంలో హంద్రీనీవా కాల్వకు గండి
గండిపడిన చోట వెంటనే మరమ్మతులు చేయాలని రైతుల డిమాండ్
మరమ్మతు పనులు చేయకుంటే ఉరవకొండలోకి నీరు వచ్చే ప్రమాదం
వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే పయ్యావుల
20:31 October 13
మరో 24 గంటలపాటు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ సవాంగ్

పునరావాస కేంద్రాలకు తరలింపులో పోలీసుల చొరవ ప్రశంసనీయం: డీజీపీ
లోతట్టు, వరద తీవ్రత ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలి: డీజీపీ సవాంగ్
కలెక్టర్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి పనిచేయాలి: డీజీపీ
డయల్ 100/112 సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు మనవి: డీజీపీ సవాంగ్
20:29 October 13
హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై పలుచోట్ల నిలిచిన వాహనాలు

ఎల్బీనగర్, పనామా, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేటలో నిలిచిన రాకపోకలు
వర్షపునీరు రహదారిపైకి చేరడంతో ముందుకు కదలని వాహనాలు
రెండుగంటలుగా వాహనాల్లోనే ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
14:02 October 13
లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అనిల్ ఆదేశం
- భారీ వర్షాల దృష్ట్యా కృష్ణా, గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి అనిల్
- జలవనరులశాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి అనిల్‌కుమార్
- లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు
- చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచనలు
- ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
14:01 October 13
పశ్చిమగోదావరి జిల్లాలో వర్ష బీభత్సం..
- ప.గో.: చింతలపూడి మండలం సీతానగరంలో ఊర చెరువుకు గండి
- వరద నీటిలో చిక్కుకున్న వ్యక్తిని స్థానికుల సాయంతో కాపాడిన ఎస్.ఐ. స్వామి
- 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన ఏర్పాట్లు చేసిన అధికారులు
13:59 October 13
వేగావతి ఉద్ధృతితో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- విజయనగరం జిల్లాలో 5.9 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు
- భోగాపురంలో 11.1 సెం.మీ., కొత్తవలసలో 10.6 సెం.మీ. వర్షపాతం
- డెంకాడలో 8.2, వేపాడలో 7.9 సెం.మీ. వర్షపాతం నమోదు
- పూసపాటిరేగ, జామి, మెంటాడ మండలాల్లో 7 సెం.మీ. వర్షపాతం
- లక్కవరపుకోట, విజయనగరంలో 6 సెం.మీ. వర్షపాతం నమోదు
- గరివిడి, పాచిపెంట, గుర్ల, గుమ్మలక్ష్మీపురంలో 6 సెం.మీ. వర్షపాతం
- గరుగుబిల్లి, సాలూరు, రామభద్రపురంలో 5 సెం.మీ. వర్షపాతం
- పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల్లో 5 సెం.మీ. వర్షపాతం నమోదు
- తోటపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,750 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,423 క్యూసెక్కులు
- తాటిపూడి జలాశయంలో 289.80 అడుగులకు చేరిన నీటిమట్టం
- వేగావతి ఉద్ధృతితో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- పాచిపెంట మండలం మోసూరులో కొట్టుకుపోయిన కాజ్ వే
- మెంటాడ, గజపతినగరం మండలాల్లో వర్షాలకు చంపావతి నది ఉద్ధృతి
- మెంటాడ మండలంలోని పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- శ్యామాయవలసలో ఈదురుగాలులకు నేలకొరిగిన విద్యుత్ స్తంభం
- గంగచోళ్లపెంట వద్ద రహదారిపై కూలిన వృక్షం, రాకపోకలకు అంతరాయం
12:52 October 13
అమరావతి మండలం పెదమద్దూరు వద్ద కొండవీటి వాగు ఉద్ధృతి
- గుంటూరు: అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో ఎడతెరపి లేని వర్షం
- గుంటూరు: బెల్లంకొండ, అమరావతి, పెదకూరపాడులో వర్షం
- అచ్చంపేటలో పొంగుతున్న వాగు, క్రోసూరు-అచ్చంపేట మధ్య నిలిచిన రాకపోకలు
- అచ్చంపేటలో ప్రభుత్వ పాఠశాల, విద్యుత్ కార్యాలయంలోకి చేరిన వర్షపు నీరు
- గుంటూరు: పెదకూరపాడు మం. కంభంపాడు వాగు వద్ద రహదారిపై వర్షపు నీటి ప్రవాహం
- అమరావతి మండలం పెదమద్దూరు వద్ద కొండవీటి వాగు ఉద్ధృతి
- కొండవీటి వాగు ఉద్ధృతితో విజయవాడ-అమరావతి మధ్య నిలిచిన రాకపోకలు
- గుంటూరు: వందల ఎకరాల్లో నీటమునిగిన పత్తి, ఇతర పంటలు
- గుంటూరు: మేడికొండూరు మం. పాలడుగులో వాగు ఉద్ధృతి
12:10 October 13
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు
వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షపాతం భారీగా నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 24.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలో 20సెం.మీ వరకు వర్షపాతం కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో 24.3, రాయవరంలో 22.7 సెంటీమీటర్లు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 20.2, శ్రీకాకుళం జిల్లాలో17 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.
11:55 October 13
గుంటూరు జిల్లా వెన్నాదేవి వద్ద గండివాగు ఉద్ధృతి
- గుంటూరు: సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద గండివాగు ఉద్ధృతి
- సత్తెనపల్లి-పిడుగురాళ్ల మార్గంలో నిలిచిన వాహనాల రాకపోకలు
11:54 October 13
బెడవాడ దుర్గగుడి ఓంకారం మలుపు వద్ద విరిగిపడిన కొండచరియలు
- విజయవాడ: దుర్గ గుడి ఓంకారం మలుపు వద్ద విరిగిపడిన కొండచరియలు
- విజయవాడ: వర్షం కారణంగా కొండపై నుంచి కిందపడిన బండరాళ్లు
- టోల్‌గేట్ నుంచి వాహనాలు పైకి వెళ్లకుండా ఆపేసిన అధికారులు
11:33 October 13
వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఇంతియాజ్
- విజయవాడ ముత్యాలంపాడు శ్రీనగర్ కాలనీలో నేలకొరిగిన భారీ వృక్షం
- విజయవాడ: నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం, తెగిపడిన విద్యుత్ తీగలు
- విజయవాడ: భవానీపురం, విద్యాధరపురం ప్రాంతాల్లో నీటమునిగిన కాలనీలు
- విజయవాడ: కొండపై ధ్వంసమైన ఇల్లు, తప్పిన ప్రాణనష్టం
- కృష్ణా: చాట్రాయి మం. మర్లపలెం దళితవాడలో ధ్వంసమైన ఇళ్లు
- కృష్ణా: చాట్రాయి మండలంలో పొంగుతున్న వాగులు, చెరువులు
- కృష్ణా: జి.కొండూరు మండలంలో పొంగిపొర్లుతున్న వాగులు
- కృష్ణా: జి.కొండూరు నుంచి గంగినేనితో పాటు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- కొండ ప్రాంతాల్లో వర్షాలకు పొంగిపొర్లుతున్న జి.కొండూరు పులి వాగు
- వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఇంతియాజ్
- కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్
- బోట్లు, మోటారు బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దు: కలెక్టర్
- వరద నీటిలో ఈతకు, స్నానాలకు వెళ్లడం చేయవద్దు: కలెక్టర్ ఇంతియాజ్
10:35 October 13
విశాఖలో వర్ష బీభత్సం
- విశాఖ: మధురవాడలో వర్ష బీభత్సానికి నేలకొరిగిన వృక్షాలు
- నాతవరం మం. గన్నవరం వద్ద వెదుళ్లగెడ్డ ప్రవాహంలో కారు బోల్తా, ఒకరు మృతి
- విశాఖ: నిన్నటినుంచి 33 కేవీ ఫీడర్లలో దాదాపు 18 చోట్ల సమస్యలు: ఈపీడీసీఎల్ ఎస్.ఇ.
- విశాఖ: 11 కేవీ ఫీడర్లలో దాదాపు 38 చోట్ల సమస్యలు ఏర్పడ్డాయి: ఈపీడీసీఎల్ ఎస్.ఇ.
- విశాఖ: చాలాచోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సమస్యలు వచ్చాయి: ఈపీడీసీఎల్ ఎస్.ఇ.
10:07 October 13
కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు..
- కృష్ణా: జగ్గయ్యపేట మండలంలో విస్తారంగా వర్షాలు
- బుధవాడ, పాలేరు, చిల్లకల్లులో రహదారులపై నీటి ప్రవాహం
- కృష్ణా: వంతెనలపై నుంచి నీటి ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
- కృష్ణా: తిరువూరు మం. మల్లేల, అక్కపాలెం, చౌటపల్లి మార్గాల్లో నిలిచిన రాకపోకలు
- కృష్ణా: వీరులపాడు మం. జుజ్జురులో ఇళ్లలోకి ప్రవేశిస్తున్న వరద నీరు
- కృష్ణా: చాట్రాయి మం. సోమవరం గ్రామ కోళ్ల ఫారాల్లోకి వర్షపునీరు
- కృష్ణా: వర్షపు నీటి కారణంగా 5 వేల కోడి పిల్లలు మృత్యువాత
- నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో నిండిన చెరువులు
09:28 October 13
విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షాలు
- విశాఖ: గొడిచెర్ల ప్రాంతంలో 200 ఎకరాల్లో నీట మునిగిన వరి
- విశాఖ: పాడేరు మండలం రాయిగెడ్డ వద్ద మత్స్యగెడ్డ ఉద్ధృతి
- విశాఖ: చిదిపుట్టు వంతెన పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు
- విశాఖ: ఎస్.రాయవరం మం. దార్లపూడి వద్ద వరాహ నది ఉద్ధృతి
- విశాఖ: తాండవ జలాశయం 3 గేట్లు ఎత్తివేత, 12 వేల క్యూసెక్కులు విడుదల
- విశాఖ: కొత్త గాజువాక 50వ వార్డు భానోజీ కాలనీలో కూలిన గోడ
- కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న రేకుల షెడ్డుపై కూలిన గోడ, తప్పిన ప్రాణనష్టం
09:06 October 13
పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అత్యవసర టెలీకాన్ఫరెన్స్
- భారీ వర్షాల దృష్ట్యా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అత్యవసర టెలీకాన్ఫరెన్స్
- తక్షణ చర్యల నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారులు, విభాగాధిపతులతో టెలీకాన్ఫరెన్స్
- సురక్షిత తాగునీరు సరఫరా చేయాలి: పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
- మురుగుకాల్వలు శుభ్రపరచాలి, క్లోరినేషన్ చేయాలి: పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
- సిబ్బంది సెలవులు రద్దుచేసుకుని విధుల్లో చేరాలి: పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
08:46 October 13
కోనాం జలాశయం గేట్లు ఎత్తి వరదనీరు విడుదల
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరం ఉప్పుటేరు పొంగి మత్స్యకారుల బోట్లు సముద్రంలోకి కొట్టుకు పోయాయి. జిల్లాలో పలుచోట్ల రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. గాలుల తీవ్రతకు పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. చాలా చోట్ల రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరకు-జీడిపల్లి మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. తెన్నేటి పార్క్ వద్దకు తీరానికి బంగ్లాదేశ్ వాణిజ్య నౌక ఎంవీ మా హెచ్ .టీ. 194 కార్గో కొట్టుకువచ్చింది. ఎలమంచిలిలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. అనంతగిరి మండలంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కొన్నిచోట్ల వృక్షాలు విరిగిపడ్డాయి.
08:45 October 13
వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెంపల్లి, వీఎన్ పురం కాలనీ, కొత్తగూడెం గ్రామాల్లోని కాలనీల్లోకి మోకాళ్ళ లోతు నీరు చేరడంతో జనజీవనానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏలూరు, బుడమేరు, రివస్ కాలువలు.. వరదతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
08:28 October 13
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు
- తూ.గో. జిల్లా తాళ్లరేవులో 24.3, రాయవరంలో 22.7 సెం.మీ. వర్షపాతం
- తూ.గో. జిల్లా రామచంద్రపురంలో 20.6, ముమ్మిడివరంలో 20.5 సెం.మీ. వర్షపాతం
- తూ.గో. జిల్లా కపిలేశ్వరపురంలో 19, పామర్రులో 19 సెం.మీ. వర్షపాతం
- తూ.గో. జిల్లా మండపేట 17.9, రావులపాలెంలో 17.8 సెం.మీ. వర్షపాతం
- తూ.గో. జిల్లా ఆత్రేయపురంలో 15 సెం.మీ. వర్షపాతం నమోదు
- ప.గో. జిల్లా ఆకివీడులో 20.2, తణుకులో 18.5 సెం.మీ. వర్షపాతం నమోదు
- ప.గో. జిల్లా పెంటపాడులో 18, తాడేపల్లిగూడెంలో 17.6 సెం.మీ. వర్షపాతం
- ప.గో. జిల్లా మొగల్తూరులో 15, నిడదవోలులో 14.9 సెం.మీ. వర్షపాతం
- ప.గో. జిల్లా పెనుగొండలో 14.7, కొవ్వూరులో 13.7 సెం.మీ. వర్షపాతం
- ప.గో. జిల్లా భీమవరంలో 12 సెం.మీ. వర్షపాతం నమోదు
- శ్రీకాకుళం జిల్లా మందసలో 17, సోంపేటలో 15.1 సెం.మీ. వర్షపాతం
- శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 13.6 సెం.మీ. వర్షపాతం నమోదు
- కృష్ణా జిల్లా చాట్రాయిలో 15.6, హనుమాన్ జంక్షన్‌లో 13.8 సెం.మీ. వర్షపాతం
- కృష్ణా జిల్లా తిరువూరులో 13, కృత్తివెన్నులో 12.6 సెం.మీ. వర్షపాతం
- కృష్ణా జిల్లా నూజివీడులో 12 సెం.మీ. వర్షపాతం నమోదు
- విశాఖ అర్బన్ 11, భీమిలిలో 15.5 సెం.మీ. వర్షపాతం నమోదు
- విశాఖ జిల్లా ఎలమంచిలిలో 13.9, నర్సీపట్నంలో 10 సెం.మీ. వర్షపాతం
- విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టులో 11 సెం.మీ. వర్షపాతం నమోదు
08:22 October 13
గోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం
- ప్రస్తుతం పూర్తిగా భూభాగంపైకి వచ్చిన తీవ్రవాయుగుండం
- గోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
07:59 October 13
తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ వాణిజ్య నౌక
- విశాఖ జిల్లాలో పలుచోట్ల రాత్రంతా కురిసిన వర్షం
- ఉప్పుటేరు పొంగి సముద్రంలోకి కొట్టుకుపోయిన మత్స్యకారుల బోట్లు
- గాలుల తీవ్రతకు పలు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి మంటలు
- వర్షం కారణంగా చాలాచోట్ల రాత్రంతా నిలిచిన విద్యుత్ సరఫరా
- అరకు-జీడిపల్లి మధ్య విరిగిపడిన కొండచరియలు
- కొండచరియలు విరిగిపడి నిలిచిన గూడ్స్ రైలు రాకపోకలు
- తెన్నేటి పార్క్ వద్దకు తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ వాణిజ్య నౌక
- రాళ్ళ మధ్యకు వచ్చిన నౌకను చూసేందుకు తీరానికి వస్తున్న ప్రజలు
- విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో ముంపుకు గురైన పలు కాలనీలు
- ఎలమంచిలి పొంగి ప్రవహిస్తున్న శేషు గడ్డ
07:38 October 13
విజయవాడలో కుండపోత వర్షం..
- కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
- విజయవాడలో రాత్రి నుంచి ముసురు వాన
- విజయవాడలో పలుచోట్ల కుండపోత వర్షం
- విజయవాడలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం
07:35 October 13
ఉప్పాడ తీరంపై తీవ్రంగా వాయుగుండం ప్రభావం..విస్తారంగా వానలు
వాయుగుండం ప్రభావం.. ఉప్పాడ తీరంపై తీవ్రంగానే చూపింది. విస్తారంగా కురుస్తున్న వానలకు..... సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో కొన్ని ఇళ్లు కోతకు గురయ్యాయి. భారీ గాలుల ప్రభావానికి పలు చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
07:23 October 13
అతి భారీ వర్షాలు
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కాసేపట్లో కాసేపట్లో కాకినాడకు ఎగువన తీరాన్ని దాటనుందని రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరించింది. మరో నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు , రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హచ్చరించింది.